బిటీష్ రాణికి ఇచ్చిన గిఫ్ట్‌ను గుర్తించని ట్రంప్

  ఆదుకున్న సతీమణి మెలానియా లండన్: బ్రిటన్‌లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్రిటీష్ రాణి రెండవ ఎలిజబెత్‌కు గత ఏడాది తాను ఇచ్చిన గిఫ్ట్‌నే గుర్తించలేక పోయారు. ఎలిజబెత్ రాణిని సోమవారం ట్రంప్, ఆయన సతీమణి మెలానియా సందర్శించినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. గత ఏడాది జూలైలో ట్రంప్ దంపతులు బ్రిటన్‌లో పర్యటించినప్పుడు వారు ఎలిజబెత్ రాణికి మిశ్రమ లోహంతోతయారు చేసిన ఒక గుర్రం ( ప్యూటర్ హార్స్) విగ్రహాన్ని కానుకగా ఇచ్చారు. కాగా […] The post బిటీష్ రాణికి ఇచ్చిన గిఫ్ట్‌ను గుర్తించని ట్రంప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆదుకున్న సతీమణి మెలానియా

లండన్: బ్రిటన్‌లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్రిటీష్ రాణి రెండవ ఎలిజబెత్‌కు గత ఏడాది తాను ఇచ్చిన గిఫ్ట్‌నే గుర్తించలేక పోయారు. ఎలిజబెత్ రాణిని సోమవారం ట్రంప్, ఆయన సతీమణి మెలానియా సందర్శించినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. గత ఏడాది జూలైలో ట్రంప్ దంపతులు బ్రిటన్‌లో పర్యటించినప్పుడు వారు ఎలిజబెత్ రాణికి మిశ్రమ లోహంతోతయారు చేసిన ఒక గుర్రం ( ప్యూటర్ హార్స్) విగ్రహాన్ని కానుకగా ఇచ్చారు. కాగా సోమవారం ట్రంప్ దంపతులకు రాణి తమ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోని పిక్చర్ గ్యాలరీలో ఉంచిన అమెరికాకు చెందిన జ్ఞాపికలను చూపించే సమయంలో ఆ గుర్రం విగ్రహాన్ని చూపించి ఇది గుర్తుందా అని ప్రశ్నించారు. అయితే ట్రంప్ దాన్ని గుర్తు పట్టలేకపోయారు. పక్కనే ఉన్న ఆయన భార్య మెలానియా వెంటనే కలుగ జేసుకుని ‘ దాన్ని మనం రాణికి కానుకగా ఇచ్చామని అనుకుంటా’ అని సర్ది చెప్పడంతో ఆ ఇబ్బందికర పరిస్థితినుంచి ట్రంప్ బైటపడ్డారని ఇండిపెండెంట్ పత్రిక తెలిపింది.

Queen Elizabeth Gift From Trump and First Lady Melania

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బిటీష్ రాణికి ఇచ్చిన గిఫ్ట్‌ను గుర్తించని ట్రంప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: