మమ్మల్నెవరూ విడదీయలేరు

Pak China

 

పాక్‌తో మైత్రిపై చైనా అధ్యక్షుడు జీ

బీజింగ్: అంతర్జాతీయంగా,ప్రాంతీయంగా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లొచ్చినా చైనాపాకిస్థాన్‌ల స్నేహం విడదీయరానిదని, అది దృఢమైందని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ బుధవారం పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు హామీ ఇచ్చారు. ఇక్కడి డియావోయుటై ప్రభుత్వ అతిథి గృహంలో పాక్ ప్రధాని ఖాన్‌ను కలిసినప్పుడు జీ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది ఆగస్ట్‌లో ప్రధాని పదవిని స్వీకరించిన తర్వాత ఇమ్రాన్‌ఖాన్ చైనా వెళ్లడం ఇది మూడోసారి.

నవశకంలో చైనా పాకిస్థాన్ ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు పాకిస్థాన్‌తో మరింత సన్నిహితంగా కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉందని జీ చెప్పారని చైనా అధికార మీడియా సిన్‌హువా వార్తాసంస్థ తెలిపింది. నిరంతర వ్యూహాత్మక సహకారంలో చైనా పాకిస్థాన్ భాగస్వాములని ఆయన స్పష్టం చేశారు.మరో రెండు రోజుల్లో ఇండియాకు వెళ్లి ప్రధాని నరేంద్రమోడీతో చైనా అధ్యక్షుడు రెండోసారి అధికారికంగా శిఖరాగ్ర సమావేశం జరపవలసి ఉంది. ఈ పరిస్థితిలో జీఇమ్రాన్ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Pak China friendship unbreakable and rock solid

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మమ్మల్నెవరూ విడదీయలేరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.