ప్రీక్వార్టర్స్‌లో సింధు

  బాసెల్ : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. తొలి రౌండ్‌లో సింధుకు బై లభించింది. దీంతో సింధు నేరుగా రెండో రౌండ్‌లో ప్రవేశించింది. రెండో రౌండ్‌లో అలవోక విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. చైనీస్ తైపీ క్రీడాకారిణి పై యు పోనుతో జరిగిన పోరులో సింధు 2114, 2114 తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ మ్యాచ్‌లో సింధు ప్రారంభం నుంచే దూకుడును ప్రదర్శించింది. తనకు మాత్రమే […] The post ప్రీక్వార్టర్స్‌లో సింధు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బాసెల్ : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. తొలి రౌండ్‌లో సింధుకు బై లభించింది. దీంతో సింధు నేరుగా రెండో రౌండ్‌లో ప్రవేశించింది. రెండో రౌండ్‌లో అలవోక విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. చైనీస్ తైపీ క్రీడాకారిణి పై యు పోనుతో జరిగిన పోరులో సింధు 2114, 2114 తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ మ్యాచ్‌లో సింధు ప్రారంభం నుంచే దూకుడును ప్రదర్శించింది.

తనకు మాత్రమే సాధ్యమయ్యే షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకు పడింది. దూకుడుగా ఆడుతూ లక్షం దిశగా అడుగులు వేసింది. దీంతో జోరును కొనసాగించడంతో ప్రత్యర్థి యుకు కష్టాలు తప్పలేదు. ప్రారంభంలో కాస్త బాగానే ఆడిన యు తర్వాత చేతులెత్తేసింది. సింధు అద్భుత షాట్లతో ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. పూర్తి ఆధిపత్యం చెలాయించిన సింధు అలవోకగా తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో కూడా భారత స్టార్‌కు ఎదురులేకుండా పోయింది. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించింది. ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ లక్షం దిశగా అడుగులు వేసింది. చివరి వరకు జోరును కొనసాగిస్తూ సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

PV Sindhu reached the quarter-finals

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రీక్వార్టర్స్‌లో సింధు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.