కోహ్లి, సానియాలకు సింధు సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్

హైదరాబాద్: కరోనా వ్యాధి రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో దాని నివారణకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందిస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లో కూడా కొవిడ్19 వ్యాధి విజృంభిస్తోంది. ఈ వ్యాధి వల్ల ఇప్పటికే దేశంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వందలాది మంది ఈ వ్యాధితో అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కరోనాపై ప్రజలను చైతన్య వంతం చేసేందుకు ప్రముఖులు కూడా నడుంబిగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకొచ్చిన సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ […] The post కోహ్లి, సానియాలకు సింధు సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: కరోనా వ్యాధి రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో దాని నివారణకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందిస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లో కూడా కొవిడ్19 వ్యాధి విజృంభిస్తోంది. ఈ వ్యాధి వల్ల ఇప్పటికే దేశంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వందలాది మంది ఈ వ్యాధితో అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కరోనాపై ప్రజలను చైతన్య వంతం చేసేందుకు ప్రముఖులు కూడా నడుంబిగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకొచ్చిన సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ వైరల్‌గా మారింది. ఈ ఛాలెంజ్‌ను ప్రముఖులు స్వీకరిస్తూ ఇతరులకు ఛాలెంజ్ విసురుతున్నారు. కాగా, భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్‌ను స్వీకరించింది.

ఛాలెంజ్‌లో భాగంగా సింధు 30 సెకన్ల పాటు చేతులను శుభ్రం చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేగాక తన ఛాలెంజ్‌ను స్వీకరించాలని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, టెన్నిస్ స్టార్ సానియా మీర్జాలకు సింధు ఛాలెంజ్ విసిరింది. తనలాగే చేతులను శుభ్రం చేసుకుని వీడియోను పోస్ట్ చేయాలని సూచించింది. అయితే దీనిపై ఇప్పటి వరకు కోహ్లి, సానియాల నుంచి స్పందన రాలేదు. కాగా, అమెరికా కాన్సుల్ జనరల్ క్యాథరిన్ హడ్డా విసిరిన ఛాలెంజ్‌ను సింధు స్వీకరించింది.

PV Sindhu embraces WHOs Safe Hands Challenge

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కోహ్లి, సానియాలకు సింధు సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.