కోడి పొదుగులో కుక్క పిల్లలు

మెదక్ : జాతి విబేధాలు మనుష్యుల మధ్యనే ఉంటాయి. అయితే అప్పుడప్పుడు మూగజీవాలు కూడా జాతి వైరాన్ని మరిచి ప్రవర్తిస్తుంటాయి. అటువంటి ఘటనకు హత్నూర మండలం నాగారంలో చోటు చేసుకుంది. కుక్కపిల్లలకు కోడి తల్లిగా మారింది. ఓ కోడి, కుక్క తమ జాతి లక్షణాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. నాగారం మాజీ ఎంపిటిసి మస్కూరి ఆగమయ్య తన పొలంలో కుక్క, కోడిని పెంచుకుంటున్నారు. కోడి పెడుతున్న గుడ్లను ఎప్పటికప్పుడు ఆగమయ్య కుటుంబం తీసుకునేది. అయితే ఆ కోడి పొదిగేందుకు […] The post కోడి పొదుగులో కుక్క పిల్లలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మెదక్ : జాతి విబేధాలు మనుష్యుల మధ్యనే ఉంటాయి. అయితే అప్పుడప్పుడు మూగజీవాలు కూడా జాతి వైరాన్ని మరిచి ప్రవర్తిస్తుంటాయి. అటువంటి ఘటనకు హత్నూర మండలం నాగారంలో చోటు చేసుకుంది. కుక్కపిల్లలకు కోడి తల్లిగా మారింది. ఓ కోడి, కుక్క తమ జాతి లక్షణాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. నాగారం మాజీ ఎంపిటిసి మస్కూరి ఆగమయ్య తన పొలంలో కుక్క, కోడిని పెంచుకుంటున్నారు. కోడి పెడుతున్న గుడ్లను ఎప్పటికప్పుడు ఆగమయ్య కుటుంబం తీసుకునేది. అయితే ఆ కోడి పొదిగేందుకు తన గూటిలో గుడ్లు లేవు. ఈ క్రమంలో ఆయన పెంచుకుంటున్న కుక్క కోడి గూటిలోకి వెళ్లి ఐదు పిల్లలను ఈనింది. నాటి నుంచి కుక్క తన పిల్లలకు పాలు ఇస్తున్న సమయంలో కోడి అక్కడే కాపలాగా ఉంటుంది. అయితే కోడిని మాత్రం తల్లి కుక్క ఏమనకపోవడం గమనార్హం. పాలిచ్చిన అనంతరం తల్లి కుక్క వెళ్లిపోగానే కుక్క పిల్లలను కోడి తన రెక్కల కింద పొదుగుతూ కప్పేసి కూర్చుకుంటోంది. కుక్క పిల్లల దగ్గరకు ఎవరు వచ్చినా, తల్లి కుక్కలాగా కోడి ప్రవర్తిస్తోంది. కుక్క, కోడి అన్యోన్యంగా ఉండడం ఆ గ్రామ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వింత ఘటన నాగారంలో చర్చనీయాంశమైంది.

Puppies In Hen udder

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కోడి పొదుగులో కుక్క పిల్లలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: