‘పుల్వామా ఘటనపై సరైన సమయంలో మాట్లాడుతాం’

న్యూయార్క్: పుల్వామా దాడిపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. ఈ దాడిని చాలా భయానకమైనదిగా ట్రంప్ అభివర్ణించారు. ఈ ఘటనపై తనకు నివేదికలు వస్తున్నాయని, ఈ ఘటనపై సరైన సమయంలో తాము మాట్లాడతామని తెలిపారు. త్వరలో ఓ ప్రకటన విడుదల చేస్తామని అన్నారు. పుల్వామా ఘటన అనంతరం భారత్‌, పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై మంగళవారం వైట్‌హౌస్‌ ఓవల్‌ కార్యాలయంలో ట్రంప్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.​ పుల్వామా ఉగ్రదాడి విషయం తన దృష్టికి […]

న్యూయార్క్: పుల్వామా దాడిపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. ఈ దాడిని చాలా భయానకమైనదిగా ట్రంప్ అభివర్ణించారు. ఈ ఘటనపై తనకు నివేదికలు వస్తున్నాయని, ఈ ఘటనపై సరైన సమయంలో తాము మాట్లాడతామని తెలిపారు. త్వరలో ఓ ప్రకటన విడుదల చేస్తామని అన్నారు. పుల్వామా ఘటన అనంతరం భారత్‌, పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై మంగళవారం వైట్‌హౌస్‌ ఓవల్‌ కార్యాలయంలో ట్రంప్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.​ పుల్వామా ఉగ్రదాడి విషయం తన దృష్టికి వచ్చిందన్న ట్రంప్ దీనిపై చాలా నివేదికలు కూడా వచ్చినట్టు వెల్లడించారు. దక్షిణ ఆసియా దేశాలైన భారత్‌, పాక్‌లు కలిసి ఉంటే అద్భుతంగా ఉంటుందన్నారు. కాగా, ఈ ఘటనను ఇప్పటికే అమెరికా విదేశాంగ శాఖ ఉప అధికార ప్రతినిధి రాబర్ట్‌ పల్లాడినో ఖండించారు. తాము భారత గవర్నమెంట్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. జవాన్ల మృతిపై కేవలం తాము సంతాపం తెలుపడమే కాకుండా భారత్‌కు మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఇక ఈ దాడిలో పాక్ ప్రేరేపిత జైష్ ఏ అహ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 44 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు కన్నమూసిన సంగతి తెలిసిందే.

Pulwama Terror Attack A Horrible Situation says Donald Trump

Related Stories: