రెండు చుక్కలు నిండు జీవితానికి భరోసా

pulse-polio

హైదరాబాద్: జిల్లాలో నేడు నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని,రెండు చుక్కలు చి న్నారుల నిండు జీవితానికి భరోసానిస్తుందని జిల్లా వైద్యాధికారి డా. జె. వెంకటి పేర్కొన్నారు. శనివారం పోలియో ఏర్పాట్లపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 0-5 సంవత్సరాల పిల్లలందరికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. మురికివాడలు, బస్తీలు, బస్టాండ్‌లు ,రైల్వేస్టేషన్‌ల్లో చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పోలియో చుక్కలు వేయాలన్నారు. జిల్లాలో 5,00,122 మంది చిన్నారులు ఉన్నారని వారికి పోలియో చుక్కలు వేసేందుకు నగరంలో 2728 బూత్‌లను ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

బస్టాండ్‌లు, రైల్వేస్టేషనల్లో 50 ట్రాన్సిట్ పాయింట్లను ఏర్పాటు చేశామని,అదే విధంగా 85 మొబైల్ టీమ్‌లు కూడా సిద్దం చేశామన్నారు. ఆదివారం బూత్‌లతో సో మ,మంగళవారాల్లో ఇంటింటికి తిరిగి చుక్కలు వేయనున్నట్లు చెప్పారు. నగరంలో 110 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించామని, ఆప్రాంతాల్లో మొ బైల్ టీమ్‌ల ద్వారా చుక్కలు వేస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరు తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి, పల్స్ పోలియో కార్యక్రమా న్ని విజయవంతం చేసి వ్యాధి నిర్మూలనలో పాలుపంచుకోవాలని ఆయ న కోరారు. ఈసమావేశంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి నాగార్జునరావు, జిల్లా మీడియా అధికారులు రాములు, వెంకటేశ్వర్లు ,శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.

pulse polio day 2020

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రెండు చుక్కలు నిండు జీవితానికి భరోసా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.