రుణమేళాలో రూ. 25 లక్షల కోట్లు

loans
అక్టోబర్‌లో ప్రభుత్వరంగ బ్యాంకులు పంపిణీ, దేశవ్యాప్తంగా 374 జిల్లాల్లో రుణ మేళా విజయవంతం: కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడి

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రుణ మేళా నిర్వహించాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు అక్టోబర్ ప్రభుత్వరంగ బ్యాంకులు వినియోగదారులకు పెద్ద మొత్తంలో రుణాలు పంపిణీ చేశాయి. గత నెలలో ప్రభుత్వరంగ బ్యాంకులు మొత్తం రూ.2.5 లక్షల కోట్ల రుణాలు ఇచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం, వినిమయానికి ఊతం అందించే ప్రయత్నంలో భాగంగా సెప్టెంబర్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రుణ మేళా కార్యక్రమాలు నిర్వహించాలని బ్యాంకులను ఆదేశించారు. దీంతో బ్యాంకులు పట్టణాల్లో, గ్రామాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించి రుణాలను పంపిణీ చేశాయి.

కేంద్రం ఆదేశాల మేరకు 2019 అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా 374 జిల్లాల్లో రుణ మేళాలు నిర్వహించాయి. ఈ విధంగా అక్టోబర్‌లో ప్రభుత్వరంగ బ్యాంకులు దాదాపు రూ.2,52,583 కోట్ల రుణాలను పంపిణీ చేశాయి. వీటిలో రూ.1,05,599 కోట్లు కొత్త టర్మ్ లోన్లు కాగా, రూ.46,800 కోట్లు కొత్త వర్కింగ్ క్యాపిటల్ లోన్లు అని ఆర్థిక సేవల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం రుణాల పంపిణీలో కొత్త టర్మ్ లోన్లతో పాటు తాజా రుణాలు 60 శాతం ఇచ్చారు. ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, ఇది గొప్ప మలుపు తిప్పే కథ అని, బ్యాంకులు పూర్తి మూలధనం కల్గి ఉన్నాయని, అన్ని రకాల రుణాలను తీర్చే స్థితిలో ఉన్నామని అన్నారు. రెండేళ్ల ప్రభుత్వ నిర్విరామ కృషితో ప్రభుత్వరంగ బ్యాంకులు తిరిగి మెరుగైన దశకు చేరుకుంటున్నాయని అన్నారు.

2019 అక్టోబర్‌లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టార్‌కు రుణాలు రూ.19,627.26 కోట్లు ఉన్నాయని తెలిపారు. కేంద్రం ఆదేశాల మేరకు ప్రైవేటు బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిల భాగస్వామ్యంతో బ్యాంకులు తొలి దశగా అక్టోబర్ 1 నుంచి 9 తేదీల్లో 226 జిల్లాల్లో నిర్వహించారు. ఆ తర్వాత రెండో దశ అక్టోబర్ 21 నుంచి 25 వరకు 148 జిల్లాల్లో నిర్వహించారు.

PSBs disburse record Rs 2 5 lakh crore loans in October

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రుణమేళాలో రూ. 25 లక్షల కోట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.