తీరుతున్న దూప…

  శుద్ధ జలాన్ని ఇంటింటికీ అందించడం మాటలు కాదు మిషన్‌భగీరథకు కేంద్ర మంచినీటి సరఫరా డిప్యూటీ సలహాదారు ప్రశంసలు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో కేంద్ర బృందం పర్యటన హైదరాబాద్: శుద్ధి చేసిన నీటిని ప్రతి ఇంటికి అందించడం గొప్ప విషయమని కేంద్ర తాగునీటి సరఫరా విభాగం డిప్యూటీ సలహాదారు రాజశేఖర్ పేర్కొన్నారు. మిషన్ భగీరథతో తెలంగాణ తాగునీటి అవసరాలు తీరుతున్నాయన్నారు. వివిధ రాష్ట్రాల్లోని తాగునీటి పథకాల తీరును పరిశీలించేందుకు కేంద్ర తాగునీటి విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. […] The post తీరుతున్న దూప… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

శుద్ధ జలాన్ని ఇంటింటికీ అందించడం మాటలు కాదు
మిషన్‌భగీరథకు కేంద్ర మంచినీటి సరఫరా డిప్యూటీ సలహాదారు ప్రశంసలు
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో కేంద్ర బృందం పర్యటన

హైదరాబాద్: శుద్ధి చేసిన నీటిని ప్రతి ఇంటికి అందించడం గొప్ప విషయమని కేంద్ర తాగునీటి సరఫరా విభాగం డిప్యూటీ సలహాదారు రాజశేఖర్ పేర్కొన్నారు. మిషన్ భగీరథతో తెలంగాణ తాగునీటి అవసరాలు తీరుతున్నాయన్నారు. వివిధ రాష్ట్రాల్లోని తాగునీటి పథకాల తీరును పరిశీలించేందుకు కేంద్ర తాగునీటి విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. అందులో భాగ ంగా ఆ బృందం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో పర్యటించారు. ఈ సందర్భంగా నాగసాలలో నిర్మించిన నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. నీటి ప్రక్రియను స్వయంగా చూశా రు. అక్కడి నుంచి జడ్చర్ల మండలం కేతిరెడ్డిపల్లె నందారం గ్రామాల్లో భగీరథ నీటి సరఫరా గ్రామస్థుల అభిప్రాయం తెలుసుకున్నారు.

నీటి నాణ్యత సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు భగీరథ నీళ్లు వచ్చినప్పటి నుంచి తమ కష్టాలు తీరాయని పేర్కొన్నారు. అనంతరం షాద్‌నగర్ కమ్మదనంలో నిర్మించిన డబ్లూటిపిని డిఫ్యూటీ సలహాదారు రాజశేఖర్ పరిశీలించారు. అన్నారం, బలిజరాల తండాల్లో పర్యటించిన ఆయన ప్రజలతో మాట్లాడారు. ఎంతో శ్రమకోర్చి తాగునీటిని సరఫరా చేస్తున్నామని అధికారులను రాజశేఖర్ ప్రశంసించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ చెన్నారెడ్డి, కన్సల్టెంట్ నర్సింగరావు, ఎస్‌ఈ సీతారాం, ఈఈలు వెంకట్‌రెడ్డి, పద్మలతలు పాల్గొన్నారు.

Provide every household cleaned water

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తీరుతున్న దూప… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: