అందని ద్రాక్షలా…కంప్యూటర్ విద్య…

  ఈ ఏడాదైనా కంప్యూటర్ విద్య నేర్పేనా ఐదేళ్లుగా మూలన పడిన కంప్యూటర్లు పట్టించుకోని విద్యాశాఖాధికారులు నిడమనూరు : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన సాంకేతిక విద్య విద్యార్థ్ధులకు దూరమై ముచ్చటగా ఐదేళ్లు అవుతోంది. పాలకుల నిర్లక్షం విద్యార్థ్ధుల పాలింటి శాపంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో 6 ను ంచి 10వతరగతి విద్యార్థ్ధులకు కంప్యూటర్ విద్య అందించాలని రూ.కోట్లు ఖర్చుచేసి కొన్ని కంప్యూటర్లును అటకెక్కించారు.ఈ విద్యా సంవత్సరమైనా విద్య అందుతుందనుకుంటే విద్యాశాఖా అటువంటి ప్రణాళికలు చేయలేదు. కంప్యూటర్ విద్యను […] The post అందని ద్రాక్షలా… కంప్యూటర్ విద్య… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఈ ఏడాదైనా కంప్యూటర్ విద్య నేర్పేనా
ఐదేళ్లుగా మూలన పడిన కంప్యూటర్లు
పట్టించుకోని విద్యాశాఖాధికారులు

నిడమనూరు : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన సాంకేతిక విద్య విద్యార్థ్ధులకు దూరమై ముచ్చటగా ఐదేళ్లు అవుతోంది. పాలకుల నిర్లక్షం విద్యార్థ్ధుల పాలింటి శాపంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో 6 ను ంచి 10వతరగతి విద్యార్థ్ధులకు కంప్యూటర్ విద్య అందించాలని రూ.కోట్లు ఖర్చుచేసి కొన్ని కంప్యూటర్లును అటకెక్కించారు.ఈ విద్యా సంవత్సరమైనా విద్య అందుతుందనుకుంటే విద్యాశాఖా అటువంటి ప్రణాళికలు చేయలేదు. కంప్యూటర్ విద్యను భోధించే ఫ్యాకల్టీలు ఉపాధి కోల్పోతున్నారు. కంప్యూటర్ విద్య ప్రైవేటు స్కూల్ విద్యార్థ్ధులకు తప్పా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి అందని ద్రాక్ష ల మారింది.

విద్యార్థ్దులకు కంప్యూటర్ పరిజ్ఞానం అభివృద్ధి చేయాలనే లక్షంతో కంప్యూటర్‌లతో పాటు కాంట్రాక్ట్ పద్దతిన ఇద్దరు చొప్పున కంప్యూటర్ నిర్వహకులను నియమించాలి. కంప్యూటర్ శిక్షణకు విద్యుత్ సమస్య తలెత్తకు ండా జనరేటర్‌ను సైతం వేలాది రూపాయలు వెచ్చించి ఏ ర్పాటు చేయించారు. కొద్దికాలంగా విద్యార్థులకు కంప్యూటర్ బోధన కొనసాగించారు. మండలంలో నిడమనూరు, తుమ్మడం, ముకుందాపురం, ముప్పారం, ఎర్రబెల్లి, రాజన్నగూడెం, నారమ్మగూడెం గ్రామాలల్లోని జిల్లాపరిషత్ ఉ న్నత పాఠశాలలకు సుమారు 5-00 కంప్యూటర్‌ల చొప్పున ప్రభుత్వం అందించారు.

కంప్యూటర్ విద్యకు బోధన చేసే వారు లేక విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ నిలిచిపోయి ంది.కంప్యూటర్‌లల్లో నైపుణ్యం పెంచుకునేందుకు విద్యార్థులు ప్రైవేట్ ఇన్సూట్యూట్‌లకు వెళ్ళాల్సిన పరిస్ధితి ఉం ది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరూపయోగంగా మారిన కంప్యూటర్‌లను ఉపయోగంలోకి తెచ్చి కంప్యూట ర్ విద్యను ప్రతి విద్యార్థ్ధికి అందించాలని విద్యార్థ్ధిని, వి ద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఉన్నతాధికారులకు నివేదిక పంపాం : నిడమనూరు జెడ్పిహెచ్‌ఎస్ హైస్కూల్
ప్రధానోపాధ్యాయుడు రాంచంద్ర నాయక్

గతేడాది ఒక కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడికి పారితోషికం చెల్లించి కొద్దివరకు విద్యార్థ్ధులకు కంప్యూటర్‌పై ప్రభు త్వం రెగ్యులర్ ఉపాధ్యాయుడిని నియమించాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపాం.

తరగతులు జరగడం లేదు :
10వతరగతి విద్యార్థ్ధిని చలికంటి సాయి లక్ష్మీ

మా స్కూల్‌లో కంప్యూటర్ల కోసం ప్రత్యేక గదిని ఏర్పా టు చేశారు.అయితే ఆ గదిని మూడేళ్లుగా తెరవడం లేదు. కంప్యూటర్‌లు ఉండి,తరగతి గది ఉన్నా ఏలా ంటి భోధన చేపట్టడం లేదు. కంప్యూటర్ తరగతులను పునరుద్ధరించాలి.

కంప్యూటర్ ఉపాధ్యాయులను నియమించాలి : 10వతరగతి విద్యార్థి నవీన్‌కుమార్

కంప్యూటర్ నేర్చుకోవాలనిఉంది. మాపాఠశాలలో కం ప్యూటర్లు ఉపయోగించకపోవడంతో పాడవుతున్నాయి .కంప్యూటర్ పాఠాలుచెప్పే వారు లేరు. ప్రభుత్వం స్పం దించి కంప్యూటర్ ఉపాధ్యాయులను నియమించాలి.

Provide Computer Knowledge to Students

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అందని ద్రాక్షలా… కంప్యూటర్ విద్య… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: