సిఐపై రాళ్ల దాడి

  పేట జిల్లాలో కలపవద్దంటూ మండల ప్రజల ఆందోళన పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ సిఐపై రాళ్లతో దాడి, గాయాలు నారాయణపేట: నూతనంగా ఏర్పాటు కానున్న నారాయణపేట జిల్లాలో కోయిలకొండ మండలాన్ని కలపవద్దంటూ మండల ప్రజలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపూ నారాయణపేటను జిల్లాగా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల హామిలో ప్రకటించారు. అందులో భాగంగా 2018 డిసెంబర్ 30న నారాయణపేటను […]

 

పేట జిల్లాలో కలపవద్దంటూ మండల ప్రజల ఆందోళన
పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ
సిఐపై రాళ్లతో దాడి, గాయాలు

నారాయణపేట: నూతనంగా ఏర్పాటు కానున్న నారాయణపేట జిల్లాలో కోయిలకొండ మండలాన్ని కలపవద్దంటూ మండల ప్రజలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపూ నారాయణపేటను జిల్లాగా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల హామిలో ప్రకటించారు. అందులో భాగంగా 2018 డిసెంబర్ 30న నారాయణపేటను జిల్లాగా ఏర్పాటు చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.

ఈ ప్రాథమిక నోటిఫికేషన్‌లో నారాయణపేట డివిజన్‌లోని 11 మండలాలతో పాటు మహబూబ్‌నగర్ డివిజన్‌లోని కోయిలకొండ మండలాన్ని కలుపుతున్నట్లు నోటిఫికేషన్ జారీ అయ్యింది. నోటిఫికేషన్‌పై అభ్యంతరాలను 30 రోజుల్లోగా ఇవ్వాలని నోటిఫికేషన్‌లో ఉండగా కోయిలకొండ మండల వాసులు అభ్యంతరాలను జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఈ విషయంపై స్థానిక ఎంఎల్ఎతో టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు చర్చించినా స్పష్టమైన హామి రాలేదు. దీంతో అధికార పార్టీ టిఆర్‌ఎస్‌తో పాటు మిగతా పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాలు, వ్యాపారస్థులు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలు జరగడంతో ప్రమాణ స్వీకారం రోజు 40 గ్రామ పంచాయతీలలో సర్పంచుల పాలకవర్గాలు కోయిలకొండ మండలాన్ని మహబూబ్‌నగర్‌లోనే ఉంచాలని తీర్మానం చేసి ప్రతులను జిల్లా కలెక్టర్‌కు అందజేశారు.

అభ్యంతరాల సమయం ముగియడంతో అధికారులు, ప్రజా ప్రతినిధుల నుంచి ఎటువంటి హామి రాకపోవడంతో ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. అందులో భాగంగా దమాయిపల్లి వద్ద రాస్తారోకో మరియు వంటావార్పు సోమవారం జేఏసి ఆధ్వర్యంలో జరుగుతుండగా ధర్నాను విరమింపజేయడానికి పోలీసులు ప్రయత్నించారు. ఆందోళనకారులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు చెదరగొడుతుండగా చెల్లాచెదురైన ఆందోళనాకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడం ప్రారంభించారు. అక్కడే ఉన్న సిఐ పాండురంగారెడ్డి తలకు తీవ్ర గాయం అయ్యింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను పూర్తిగా చెదరగొట్టారు. వెంటనే చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Protesters attack on CI with stones in Protest at Damai Palli

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: