అడవులను రక్షించుకోవాలి : ఇంద్రకరణ్ రెడ్డి

Protect the Forests : Minister Indrakaran Reddyఆదిలాబాద్‌: అడవులను రక్షించుకోవడం అందరి బాధ్యత అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ లోని మావల పార్కులో బుధవారం పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మొక్కలు నాటారు. అక్రమ కలప రవాణాదారులపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. అడవులను నరకకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆయన ఆదేశించారు. హరితహారంలో భాగంగా మావల పార్కు నుంచి చాందా – టీ వరకు రోడ్లకు ఇరువైపుల ఒక్క రోజే లక్ష మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు చేశారని ఆయన పేర్కొన్నారు. గతంలో నిర్వహించిన ఐదు విడతల హరితహారంలో నాటిన మొక్కల్లో 70 శాతం బతికాయని, ఆరో విడతలో నాటనున్న 30 కోట్ల మొక్కల్లో 85 శాతం బతికేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎలు జోగు రామన్న, రాఠోడ్ బాపురావు, అధికారులు, టిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post అడవులను రక్షించుకోవాలి : ఇంద్రకరణ్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.