డుమ్మా కొట్టే ఉద్యోగుల్లో గుబులు

  ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉదాసీనత తగ్గించేందుకు వినూత్న చర్యలు ప్రతి ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే డాక్టర్ల పేర్లను డిస్‌ప్లే చేయాలని ఆదేశం ఇప్పటికే విద్యాశాఖలో ‘నేను నావృతిని ప్రేమిస్తున్నాను’ అమలు, రాష్ట్ర వ్యాప్తంగా ‘ములుగు – వెలుగు’ యాప్ అమలుకు యోచన?, టిక్ టాక్ షోలతో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల పనితీరులో పారదర్శకతను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు పూనుకుంటుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు కేవలం మొక్కుబడిగా విధినిర్వహణకు వచ్చి అటెండెన్స్ […] The post డుమ్మా కొట్టే ఉద్యోగుల్లో గుబులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉదాసీనత తగ్గించేందుకు వినూత్న చర్యలు
ప్రతి ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే డాక్టర్ల పేర్లను డిస్‌ప్లే చేయాలని ఆదేశం
ఇప్పటికే విద్యాశాఖలో ‘నేను నావృతిని ప్రేమిస్తున్నాను’ అమలు, రాష్ట్ర వ్యాప్తంగా ‘ములుగు – వెలుగు’ యాప్ అమలుకు యోచన?, టిక్ టాక్ షోలతో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు

ప్రభుత్వ ఉద్యోగుల పనితీరులో పారదర్శకతను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు పూనుకుంటుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు కేవలం మొక్కుబడిగా విధినిర్వహణకు వచ్చి అటెండెన్స్ రిజిస్ట్రర్‌లో సంతకం చేసి వెళ్ళడమే కాకుండా చిత్తశుద్ధితో బాధ్యతాయుతంగా పనిచేసేవిధంగా పలు చర్యలను పూనుకుంటుంది. ఇటీవల పలు చోట్ల ఉద్యోగులు పని వేళలో పనులు మాని టిక్ టాక్ షోలో యాక్టర్లవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వారి విధినిర్వహణను మరింత సీరియస్‌గా చేసే విధంగా అనేక చర్యలు తీసుకుంటుంది.

ఉద్యోగుల్లో సమయపాలనను పెంపేందించేందుకు పలు కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజర్ పరికరాలను ఏర్పాటు చేసినప్పటికీ కూడా వారిలో మార్పు రావడం లేదు. లంచాలు ఇవ్వొద్దు – తీసుకోవద్దు అని ఎసిబి అధికారులు హితబోధ చేసినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల్లో మార్పులు కన్పించడం లేదు. దీంతో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించి విధినిర్వహణలో నీతి, నిజాయితీగా ఉండి చిత్తశుద్ధితో పనిచేసేవిధంగా అనేక చర్యలు తీసుకుంటుంది. ప్రధానంగా నిత్యం ప్రజలతో సత్ సంబంధాలు కలిగి ఉండే విద్యా, వైద్య, ఆరోగ్యశాఖలో పలు మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఖమ్మం : విద్యాశాఖలో పనిచేసే ఉపాధ్యాయులంతా బడిని ఎగ్గొట్టి ఇతర ప్రైవేట్ వ్యాపకాలకు లోనవుతున్నారని తెలిసి చాలా ప్రభుత్వ పాఠశాలలలో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేశారు. చాలా చోట్ల వాటిని పనిచేయకుండా మరమ్మతులకు గురయ్యేవిధంగా చేశారు. దీంతో ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి ‘ప్రతి టీచర్ తాను పనిచేసే పాఠశాల గదిలో తన టెబుల్‌పై నేను నా వృత్తిని ప్రేమిస్తున్నాను” అని రాసి ఉన్న సైన్‌బోర్డును ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించడంతో మెజార్టీ పాఠశాలలో ఉపాధ్యాయులంతా ఆ విధంగా రాసి తన వృత్తిపట్ల బాధ్యతాయుతంగా మెలుగుతున్నారు.

అంతేగాక ఉపాధ్యాయులంతా తరగతి గదిలో సెల్ ఫోన్ వాడకాన్ని నిషేధించారు. ఎవరైనా తరగతి గదిలో సెల్‌ఫోన్‌ను ఉపయోగించినట్లైతే వారిని విధుల నుంచి తొలగించేస్తున్నారు. ఇటీవల ఆళ్ళగడ్డ మండలంంలో ఒక టీచర్‌ను పాఠశాలలో సెల్ ఫోన్ వాడినందుకు సస్పెండ్ చేశారు. ఉపాధ్యాయులంతో పాటు విద్యార్థులు కూడా క్రమశిక్షణతో మెలిగే విధంగా మరో చర్య తీసుకుంది. పాఠశాలలో విద్యార్థుల హాజర్ శాతాన్ని పెంచేందుకు మరో కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నారు. ప్రతి రోజు విద్యార్థులు క్రమం తప్పకుండా సక్రమంగా హాజరుకావాలనే ఉద్దేశ్యంతో వచ్చే ఆగస్ట్ నెలలో హాజరు మాసోత్సవాలను నిర్వహించబోతున్నారు.

ఈ నెలలో ఒక్క విద్యార్థి కూడా గైర్హాజర్ కాకుండా చూడటమే లక్షంగా పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఇప్పుడు తాజాగా వైద్యశాఖలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా డాక్టర్ల హాజర్ కోసం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నప్పటికీ సమయానికి వచ్చి హాజరు వేసుకొని తిరిగి ప్రైవేట్ క్లీనిక్‌కు వెళ్లి వ్యాపారం చేసుకుంటూ మళ్ళీ తన సమయం ముగిసే సమయానికి వచ్చి మళ్ళీ ఆసుపత్రికి వచ్చి బయోమెట్రిక్‌లో హాజరు వేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు అన్ని ఆసుపత్రుల్లో డాక్టర్ల పేర్లను, వారు చూసే ప్రత్యేక విభాగాన్ని, డాక్టర్ యొక్క డ్యూటీ వేళలను ప్రతి ఆసుపత్రిలో డిస్‌ప్లే చేసి రోగులకు అందుబాటులో ఉంచాలని తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ ఆదేశించారు.

ప్రధానంగా ఏరియా, జిల్లా కేంద్ర ఆసుపత్రిల్లో ఓపి సమయంలో ఆ రోజు డ్యూటీలో ఉండే డాక్టర్ల పేర్లు, వారి విభాగం, అసలు ఆసుపత్రిలో పనిచేసే మొత్తం డాక్టర్ల పేర్లు, వారి ప్రత్యేకత, వారి సెల్ నెంబర్లు, వారి డ్యూటీ వేళలో పెద్ద బోర్డులో రాసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రైవేట్ సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రుల ముందు, ప్రైవేట్ క్లీనిక్‌ల ముందు డాక్టర్ల బోర్డులను ఏర్పాటు చేసిన మాదిరిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీని వల్ల ఓపి సమయంలో ఆసుపత్రికి వచ్చిన రోగులు ఆ సమయంలో డాక్టర్లు అందుబాటులో ఉండకపోతే వారి సెల్ నెంబర్‌కు నేరుగా రోగులే ఫోన్లు చేసే విధంగా డాక్టర్ల జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచబోతున్నారు.

ఏరియా, జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో అసలు ఎంత మంది డాక్టర్లు ఉన్నారు. వారు ఏ వైద్యంలో నిష్టాతులు వివరాలు ఆసుపత్రులకు వచ్చే రోగులకు తెలియదు. చాలా మంది ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయని ఒక్క స్పెషలిస్ట్ ఉండరనే అపవాదు ఉంది. కానీ చాలా ఆసుపత్రుల్లో డాక్టర్ల పోస్టులన్నీ భర్తీగా ఉంటాయేగాని వారు సక్రమంగా డ్యూటీకి రాకపోవడం, ఎక్కువ సమయాన్ని తమ ప్రైవేట్ క్లీనిక్‌లోనే గడుపుతున్నారు. దీనికి చెక్ పెట్టేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డాక్టర్ల పేర్లతో ఆసుపత్రుల్లో బోర్డులను ఏర్పాటు చేస్తే వారి డ్యూటీ సమయాలు రోగులకు తెలియడంతోపాటు ఆ సమయంలో వారు పనిచేసే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నారా లేక ప్రైవేట్ క్లీనిక్‌లో ఉన్నారా అనే విషయం తెలిసిపోతుంది.

ఓపి సమయంలో డాక్టర్ల డ్యూటీ సమయంలో కూడా చాలా మంది డాక్టర్లు గైర్హాజరవుతున్నారు. దీంతో రోగులంతా వారి కోసం పడిగాపులు కాసి తిరిగుముఖం పట్టి ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇకపై అలా జరగకుండా డాక్టర్లను రోగులే నిలదీసే విధంగా డాక్టర్ల వివరాలను ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజల అవసరం నిమిత్తం అందుబాటులో ఉంచనున్నారు. ఉద్యోగుల్లో విధినిర్వహణ కర్తవ్యాన్ని గుర్తుచేసేందుకు, సమయపాలనను పాటించేందుకు జిల్లా సమీపంలోనే ములుగు జిల్లా కలెక్టర్ తానే స్వయంగా తయారుచేసిన ములుగు వెలుగు ప్రత్యేక యాప్ ద్వారా ఆ జిల్లాకు చెందిన అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులంతా తమ డ్యూటీ సమయానికల్లా కార్యాలనికి వెళ్ళి వారి సీట్లో ఆసీనులైన అనంతరం సెల్ఫీ దిగి అప్‌లోడ్ చేసే విధంగా ఏర్పాట్లు చేయడంతో ఆ జిల్లాలోని అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులంతా ఉరుకులు, పరుగులు తీస్తూ విధులకు హాజరవుతున్నారు.

జిల్లా కేంద్రంలోనే కాదు మారు మూల గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు సైతం సరిగ్గా ఉదయం 10 గంటలకల్లా వారికి కేటాయించిన కార్యాలయంలో నుంచి చైర్‌లో కూర్చోని ఉన్న సెల్ఫీ ఫోటోను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కార్యాలయ సమయం తరువాత అప్‌లోడ్ చేస్తే రిసీవ్ చేసుకోదు. ఇంటర్‌నెట్ సౌకర్యం లేని ప్రాంతాల్లో కూడా ఈయాప్ పనిచేసే విధంగా తీర్చిదిద్దారు. అంతేగాక ఇదే యాప్‌లో సదరు ఉద్యోగి సెలవులో ఉంటే ఆ విషయాన్ని పేర్కొనే సౌకర్యం కల్పించారు. అంతేగాక ఆఫీస్ పని మీద బయటే ఉంటే ఆ విషయాన్ని పేర్కొనే సౌకర్యాన్ని కూడా ఈ యాప్‌లో పొందుపర్చారు.

ఈ విధానం వల్ల ఉద్యోగులంతా ఠంచన్‌గా కార్యలయానికి హాజరై ఒక సెల్ఫీ దిగి అప్‌లోడ్ చేస్తున్నారు. ఇది జిల్లా ఆఫీసర్ నుంచి అటెండర్ వరకు అన్ని కేటగిరి ఉద్యోగులు అప్‌లోడ్ చేయాల్సిందే. ములుగు జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇదే జరిగితే నిర్ణత ప్రభుత్వ ఆఫీస్ సమయానికల్లా ఉద్యోగులు హాజరుకావడం జరుగుతుంది. తద్వారా ప్రజల పనులు కూడా అంతే వేగంగా పూర్తి అవుతాయి. ఈ విధానం ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతను మరింత పెంచినట్లవుతుంది.

Promote transparency in the performance of Employees

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post డుమ్మా కొట్టే ఉద్యోగుల్లో గుబులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: