త్వరలో ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం

మనతెలంగాణ/వరంగల్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముఖ్యమంత్రి కెసిఆర్‌తో అడుగులో అడుగేసి పనిచేసిన టిఎన్‌జిఒ ఉద్యోగుల సమస్యలను సిఎం కెసిఆర్ త్వరలోనే పరిష్కరిస్తారని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి మాజీ టిఎన్‌జిఒ అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్ హామీనిచ్చారు. ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండ టిఎన్‌జిఒ భవన్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కారం రవీందర్‌రెడ్డి అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎక్సైజ్‌శాఖా మంత్రి శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి […] The post త్వరలో ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/వరంగల్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముఖ్యమంత్రి కెసిఆర్‌తో అడుగులో అడుగేసి పనిచేసిన టిఎన్‌జిఒ ఉద్యోగుల సమస్యలను సిఎం కెసిఆర్ త్వరలోనే పరిష్కరిస్తారని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి మాజీ టిఎన్‌జిఒ అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్ హామీనిచ్చారు. ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండ టిఎన్‌జిఒ భవన్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కారం రవీందర్‌రెడ్డి అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎక్సైజ్‌శాఖా మంత్రి శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్ పశ్చిమ ఎంఎల్‌ఎ దాస్యం వినయ్‌భాస్కర్, తూర్పు ఎంఎల్‌ఎ నన్నపునేని నరేందర్, నగర మేయర్ గుండా ప్రకాష్‌రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టిఎన్‌జిఒ రాష్ట్ర అధ్యక్షులు కారం రవీందర్‌రెడ్డి ఉద్యోగుల సమస్యలను మంత్రులకు వివరించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికి పిఆర్‌సిని అమలు చేయాల్సి ఉందని, దాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి అమలు చేయాలని కోరారు. టిఎన్‌జిఒ ఉద్యోగులకు సంబంధించిన సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన ఫంక్షన్‌హాల్స్, టిఎన్‌జిఒల భవనాల నిర్మాణం తక్షణమే ఏర్పాటు చేయాలని అందుకు సంబంధించిన నిధులను కేటాయించాలని చెప్పారు.

ఈ సందర్భంగా జిల్లాలకు సంబంధించిన టిఎన్‌జిఒ అధ్యక్షులు వారి సమస్యలపై మాట్లాడారు. అనంతరం రాష్ట్ర ఎక్సైజ్‌శాఖా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ టిఎన్‌జిఒ ఉద్యోగ సంఘం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు, త్యాగాలను చేసిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యమ నాయకునిగా ఆయన చూపిన దారిని ఉద్యోగులు గమ్యాన్ని ముద్దాడారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కెసిఆర్ వెన్నంటి ఉన్న ఉద్యోగ సంఘాలను ఎన్నడూ నిర్లక్షం చేయబోరన్నారు. త్వరలోనే టిఎన్‌జిఒ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కెసిఆర్ తీపి కబురు చెప్పనున్నారన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ టిఎన్‌జిఒ ఉద్యోగులు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వానికి శ్రేయోభిలాషులన్నారు. వారి సమస్యలు పరిష్కరించడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రగతికి వారి సహకారం అవసరమన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. అటు ప్రభుత్వం ఇటు ఉద్యోగులు కలిసి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని, వారికి సంబంధించిన సమస్యలు కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ సానుకూల ధోరణితో స్పందించి పరిష్కరిస్తారన్నారు.
భద్రకాళి, వేయిస్తంభాల దేవాలయ అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రులు..
వరంగల్ అర్బన్ జిల్లాలోని వరంగల్, హన్మకొండ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావులు స్థానిక శాసనసభ్యులు, మేయర్, టిఎన్‌జిఒ ఉద్యోగ నాయకులతో కలిసి సందర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వరంగల్ నగర అభివృద్ధికి చారిత్రక కట్టడాలు, గ్రీనరి కోసం కేటాయించిన నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిలో భద్రకాళి బండ్ నిర్మాణం, గ్రీనరీ, వేయిస్తంభాల గుడి పునర్నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులే కాకుండా కేంద్రం నుండి రావాల్సిన వాటాను కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు మంజూరి చేయిస్తామని హామీనిచ్చారు. వరంగల్ నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పరచడమే టిఆర్‌ఎస్ ప్రభుత్వ లక్షమన్నారు.

Problems of TNGO employeesRelated Images:

[See image gallery at manatelangana.news]

The post త్వరలో ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.