నిరుద్యోగం కోరల్లో దేశం!

తమిళనాడులో 992 మంది పిహెచ్‌డిలు, 23000 మంది ఎం.ఫిల్.లు గ్రామస్థాయిలో గుమాస్తా పని చేయడానికి దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ఉద్యోగాలకు మొత్తం 20 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఖాళీలు 95000. దరఖాస్తు చేసుకున్న 20 లక్షల మందిలో రెండున్నర లక్షల మంది పోస్టుగ్రాడ్యుయేట్లు. ఈ ఉద్యోగానికి కనీసార్హత కేవలం పదవ తరగతి. దేశంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే ఉత్తరప్రదేశ్ పోలీసు డిపార్టుమెంటులో అతి క్రిందిస్థాయి మెసెంజర్ పోస్టు 62 లకు 50 వేల మంది […]

తమిళనాడులో 992 మంది పిహెచ్‌డిలు, 23000 మంది ఎం.ఫిల్.లు గ్రామస్థాయిలో గుమాస్తా పని చేయడానికి దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ఉద్యోగాలకు మొత్తం 20 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఖాళీలు 95000. దరఖాస్తు చేసుకున్న 20 లక్షల మందిలో రెండున్నర లక్షల మంది పోస్టుగ్రాడ్యుయేట్లు. ఈ ఉద్యోగానికి కనీసార్హత కేవలం పదవ తరగతి.

దేశంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే ఉత్తరప్రదేశ్ పోలీసు డిపార్టుమెంటులో అతి క్రిందిస్థాయి మెసెంజర్ పోస్టు 62 లకు 50 వేల మంది గ్రాడ్యుయేట్లు, 28 వేల మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, 3,700 మంది పిహెచ్‌డిలు దరఖాస్తు చేశారు. ఈ ఉద్యోగానికి కనీస విద్యార్హత కేవలం 5వ తరగతి.

మొత్తం 62 పోస్టులకు 93 వేల అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ విద్యార్హత ఉన్నవారి సంఖ్య కేవలం 7,400 మంది. ఈ ఉద్యోగం పోస్టుమ్యాన్ పని వంటిది. పోలీసు కార్యాలయాల్లో ఒక దాని నుంచి మరో కార్యాలయానికి లేఖలు అందించే పని. 12 సంవత్సరాల తర్వాత ఈ ఉద్యోగాలకు ఖాళీ లు వచ్చాయి. ఈ ఉద్యోగం చేయాలంటే సైకిలు తొక్కడం వస్తే చాలు. ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన తర్వాత ఇప్పు డేం చేయాలని ఆలోచించి రాతపరీక్ష పెట్టాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. తమిళనాడులో 992 మంది పిహెచ్‌డిలు, 23000 మంది ఎం.ఫిల్.లు గ్రామస్థాయిలో గుమాస్తా పని చేయడానికి దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ఉద్యోగాలకు మొత్తం 20 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఖాళీలు 95000. దరఖాస్తు చేసుకున్న 20 లక్షల మందిలో రెండున్నర లక్షల మంది పోస్టుగ్రాడ్యుయేట్లు. ఈ ఉద్యోగానికి కనీసార్హత కేవలం పదవ తరగతి.

మొన్న ఏప్రిల్‌లో పశ్చిమ బెంగాల్లోని జాదవ్‌పూర్‌లో 70 ప్యూన్ పోస్టులకు ప్రకటన ఇచ్చారు. 11వేల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్నవారిలో పిహెచ్‌డి, ఎంఎస్‌సి, ఎం.టెక్, బి.టెక్, బియస్‌సి అభ్యర్థులున్నారు. ఈ పోస్టుకు కనీస విద్యార్హత కేవలం 8వ తరగతి పాసవ్వడం. మే నెలలో హర్యానాలో కానిస్టేబుల్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ సందర్భంగా ఎంబిఎ, బి.ఎల్., ఎల్.ఎల్.బి, ఎం.టెక్ వంటి ఉన్నత విద్యార్హతలున్న వారు దరఖాస్తులు చేసుకున్నారు. దేశంలో అత్యధికంగా ఉద్యోగావకాశాలు కల్పించేది భారతీయ రైల్వే. అందులో లక్ష ఉద్యోగాలకు ప్రకటన వచ్చినప్పుడు రెండు కోట్ల మంది దరఖాస్తులు చేసుకున్నారు. అత్యధిక విద్యార్హతలున్నవారు కూడా చిరు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవడం దేశంలోని నిరుద్యోగ సమస్యకు నిదర్శనం.

మార్చి నెలలో వందలాది విద్యార్థులు ముంబయి రైల్వే ట్రాకులపై కూర్చుని ఉద్యోగాల కోసం ధర్నా చేసిన సంఘటన పరిస్థితి తీవ్రతను తెలుపుతుంది. ఈ మధ్యనే మహారాష్ట్రలో 3500 మంది యువకులు ముఖ్యమంత్రిని కలిసి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత రెండు సంవత్సరాలుగా మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు జరగడం లేదు. 45 వేల ఉద్యోగాలు భర్తీ చేయలేదు. మహారాష్ట్రలో యువకులు ఈ విషయమై ఆందోళనకు దిగారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం దేశంలో 3 కోట్ల 10 లక్షల మంది యువత ఉద్యోగాల కోసం చూస్తున్నారు.
దేశంలో నిరుద్యోగ సమస్య సంక్షోభ స్థాయికి చేరుకునే సూచనలున్నాయి. జనవరిలో నిరుద్యోగం 6.1 శాతానికి చేరుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేమి చాలా తీవ్రంగా ఉంది. మహారాష్ట్రలో కరువు, రుణభారం, ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లేకపోవడం వంటి కారణాల వల్ల లక్షలాది యువకులు వ్యవసాయం వదిలి ఉద్యోగాల వేటలో ఉన్నారు. వ్యవసాయం స్థిరమైన ఉపాధిగా ఇప్పుడు ఎవరూ భావించడం లేదు. 35 వేల మంది రైతులు బొబ్బలు పడిన కాళ్ళతో రుణమాఫీ తదితర డిమాండ్ల కోసం ముంబయి వచ్చిన సంఘటన చాలా మందిని వ్యవసాయమంటే భయపడేలా చేసింది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో యువతరం ఉద్యోగాల వేటలో ఉంది.

నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు హామీ ఇచ్చిన ఉద్యోగాలు లభిస్తాయని ఎదురు చూస్తోంది. కాని ఉద్యోగాలెక్కడ? రాజస్థాన్ సెక్రటరియేట్ లో 18 ప్యూన్ పోస్టులకు ప్రకటన వస్తే 129 మంది ఇంజనీర్లు, 23 మంది లాయర్లు, ఒక చార్టర్డ్ ఎక్కౌంటెంట్, 393 మంది పోస్టు గ్రాడ్యుయేట్లతో సహా మొత్తం 12,453 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఎంత దయనీయమైన స్థితి. విచిత్రమేమంటే ఎంపికైన 18 మందిలో పదవతరగతి పాసైన 30 సంవత్సరాల ఒక యువకుడు కూడా ఉన్నాడు. అతను బిజెపి ఎమ్మెల్యే కుమారుడు. బిజెపి ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు పదేళ్ళలో 25 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. అంటే ఏటా రెండున్నర కోట్ల ఉద్యోగాలు. 2015లో కేవలం 1.55 లక్షల ఉద్యోగాలు, 2016లో 2.31 లక్షల ఉద్యోగాలు, 2017లో 4.16 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలిగారు. పెరుగుతున్న నిరుద్యోగుల సంఖ్య, ఇస్తున్న ఉద్యోగాల రేటు చూస్తుంటే భవిష్యత్తులో భయంకరమైన సంక్షోభ పరిస్థితి తలెత్తేలా ఉంది.

నోట్లరద్దు వల్ల ఉపాధి కోల్పోయిన వారు కూడా ఇప్పుడు ఉద్యోగాల వేటలో ఉన్నారు. ఇప్పుడున్న 3 కోట్ల 10 లక్షల మంది నిరుద్యోగులకు మే తర్వాత మరింత మంది కళాశాలల నుంచి పట్టాలు పుచ్చుకుని వచ్చి కలుస్తారు. 2018లో మహా అయితే ఆరులక్షలకు మించి ఉద్యోగాలు కల్పించే పరిస్థితి కనబడడం లేదు. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇక ఊహించుకోవచ్చు.

Comments

comments