ద్రవ్యోల్బణం పెరగడంపై ప్రియాంక విమర్శ

Priyanka Gandhi

న్యూఢిల్లీ : కూరగాయలు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగి, పేద ప్రజలపై విపరీత ప్రభావం చూపడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. టోకు ద్రవ్యోల్బణం ఐదున్నరేళ్ల స్థాయికి 7.35 శాతానికి పెరిగినట్టు డేటా వెలువడడంపై ప్రియాంక తీవ్రంగా విమర్శించారు. సామాన్య ప్రజల జీవన విధానం దెబ్బతీసేలా వారి జేబులను ఖాళీ చేయిస్తున్నారని వ్యాఖ్యానించారు. కూరగాయలు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోతే సామాన్యులు ఏం తినగలుగుతారని ఆమె ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వం పేద ప్రజల జేబులు ఖాళీ చేయించడమే కాకుండా వారి పొట్టపై కొడుతోందని వ్యాఖ్యానించారు.

Priyanka criticizes government for rising inflation

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ద్రవ్యోల్బణం పెరగడంపై ప్రియాంక విమర్శ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.