హీరోయిన్లను ఇలా..హీరోలను అలా

 

ముంబై: చిత్రపరిశ్రమలో రెండు ద్వంద్వ ప్రమాణాలు కొనసాగుతున్నాయంటూ ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మండిపడ్డారు. ఇద్దరు హీరోయిన్లు కలసి ఒక సినిమాలో నటిస్తే వారి మధ్య కీచులాటలు ఉన్నాయని, వారి మధ్య సఖ్యత లేదని పత్రికలు రాస్తాయని, అదే ఇద్దరు హీరోలు కలసి నటిస్తే వారి మధ్య స్నేహబంధం వెల్లివిరిసిందని, వారిద్దరూ ఎంతో అవగాహనతో నటించారని రాస్తాయని ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించారు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో శనివారం జరిగిన ఒక అందాల పోటీకి హాజరైన ప్రియాంక చోప్రా ఇఆన్‌లైన్.కామ్ అనే వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వూలో నిర్మొహమాటంగా ఫిలిమ్ ఇండస్ట్రీపై నిప్పులు చెరిగారు. నన్ను ఇంటర్వూ చేసే జర్నలిస్టులు మీరు ఆ హీరోయిన్‌తో కలసి నటిస్తున్నారు కదా&ఆమెతో మీకు గొడవలేమైనా జరిగాయా..సెట్స్‌లో మీరిద్దరూ మాట్లాడుకుంటారా అని అడుగుతుంటారు. అదే హీరోల విషయానికి వచ్చేసరికి ఆ ఇద్దరు నటులు చక్కని అవగాహనతో నటించారంటూ డబ్బా కొట్టేస్తుంటారు. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు అంటూ ప్రియాంక రుసరుసలాడారు. దీనికి ప్రధాన కారణం ఫిలిమ్ ఇండస్ట్రీలో మహిళలకు అవకాశాలు చాలా తక్కువని, హీరోలతో పోలిస్తే హీరోయిన్లు చాలా తక్కువ సమయంలోనే తెరమరుగవుతారని ఆమె చెప్పారు. అందుకే హీరోయిన్లు అవకాశాల కోసం పోటీపడుతుంటారని, ఈ పోటీ కారణంగానే అసూయ, ద్వేషాలు ఏర్పడతాయని ఆమె అన్నారు. మహిళలు ఏ ఇండస్ట్రీలో ఉన్నా అవకాశాలు తామే సృష్టించుకోవాలని, అప్పుడే మహిళల మధ్య స్నేహబాంధవ్యాలు ఏర్పడతాయని ఆమె అభిపాయపడ్డారు.‚

 

Priyanka Chopra calls out double standards in Bollywood, Bromance for Boys, cats fights for female actors

The post హీరోయిన్లను ఇలా..హీరోలను అలా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.