జైలులో ఖైదీ ఆత్మహత్య

మహబూబ్ నగర్: జైలులో ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వీరేశ్ అనే ఖైదీ శనివారం అర్థరాత్రి జిల్లా జైలు బ్యారక్ గదిలో పైన ఉన్న వెంటిలేటర్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు జైలు అధికారులు తెలిపారు. ఖైదీని జోగులాంబ గద్వాల్ జిల్లా కెటిదొడ్డి మండలం పాత పాలెం గ్రామానికి చెందిన ఉరబాయ్ వీరేశ్ (29)గా గుర్తించారు.  వీరేశ్ పై అత్యాచరం కేసు నమోదైంది. ఈ కేసులో  వీరేశ్ […] The post జైలులో ఖైదీ ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మహబూబ్ నగర్: జైలులో ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వీరేశ్ అనే ఖైదీ శనివారం అర్థరాత్రి జిల్లా జైలు బ్యారక్ గదిలో పైన ఉన్న వెంటిలేటర్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు జైలు అధికారులు తెలిపారు. ఖైదీని జోగులాంబ గద్వాల్ జిల్లా కెటిదొడ్డి మండలం పాత పాలెం గ్రామానికి చెందిన ఉరబాయ్ వీరేశ్ (29)గా గుర్తించారు.  వీరేశ్ పై అత్యాచరం కేసు నమోదైంది. ఈ కేసులో  వీరేశ్ కు బెయిల్ రాలేదు. వీరేశ్ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని జైలు అధికారులు వెల్లడించారు. శవ పరీక్ష నిమిత్తం వీరేశ్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Prisoner Commits Suicide In Mahabubnagar Prison

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జైలులో ఖైదీ ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: