నుమాయిష్‌లో ప్రజల భద్రతకు ప్రాధాన్యం

Numaish

 

అగ్నిప్రమాదాలు, ఇతర ఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు
అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ పనులు
రెండు భారీ నీటి సంపులు
ఈ దఫా స్టాళ్లను తగ్గిస్తాం
మంత్రి ఈటల రాజేందర్

నాంపల్లి : నాంపల్లిలో ఎగ్జిబిషన్ మైదానంలో వచ్చే ఎడాది కొత్త సంవత్సరంలో జరిగే 80వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) నిర్వహణలో సందర్శకులు, స్టాల్ నిర్వాహకుల భద్రత విషయంలో అదనపు పకడ్బందీ చర్యలతో అత్యంత ప్రాధా న్యం ఇస్తున్నామని రాష్ట్ర వైద్యాశాఖ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ చైర్మన్ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గతేడాది జరిగిన అగ్ని ప్రమాదం ఘటన అందర్నీ తీవ్ర దిగ్భ్రాంతి కల్గించిందని, ఈ తరహా మళ్లీ పునరావృతం కాకుండా ముందస్తు చర్యలతో కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. శుక్రవారం నాంపల్లిలో ఎగ్జిబిషన్ మైదానంలో ప్రజల భద్రత కోసం చేపట్టిన వివిధ అభివృద్ధ్ది పనులను ఆయన పరీశీలించారు.

అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ వచ్చే నుమాయిష్‌లో ప్రజల ప్రాణాల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని, ఈ దిశగా ఇదివరకు ఎన్నడూ లేని విధంగా చర్యలు అమలుచేస్తున్నామని వివరించారు. ఇదివరలో ఘటనల నేపథ్యంలో సందర్శకుల్లో నెలకొన్న అపోహలను దూరం చేసి అందరూ సురక్షితంగా ఎగ్జిబిషన్‌ను సందర్శించేవిధంగా చర్యలు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ప్రజల భద్రత మేరకు విద్యుత్ సంబంధించిన పనులు అండర్‌గ్రౌండ్ కేబుల్ సిస్టంగా మార్చమన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు 80 శాతం ఓవర్ హెడ్ పవర్ కరెంట్ లైన్లు వేశామని, 20 శాతం ఓవర్ హెడ్ పవర్‌లైన్స్‌ను 473 మీటర్లు నిడువు అండర్ గ్రౌండ్ కేబుళ్ల పనులను త్వరితంగా పూర్తిచేస్తామని ఈటల రాజేందర్ వివరించారు. వచ్చే నూమాయిష్‌లో అదనంగా 10 డిస్ట్రిబ్యూషన్ బాక్సులను ఏర్పాటుచేస్తున్నామని, స్టాళ్లలో విద్యుత్ తీగలను పీవీసీ పైపులతో వేస్తామన్నారు.

నూమాయిష్‌లో వేలసంఖ్యలో ప్రజలు రానున్న దృష్టా లోపల తొక్కిసిలాట వంటి ఘటనలు నిరోధానికి స్టాళ్ల సంఖ్య తగ్గిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఈ దఫా లోపల లూజ్‌వైర్లు, షార్ట్‌సర్కూట్ వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని, ఒక వేళ ప్రమాదం సంభవిస్తే త్వరితంగా అదుపుచేసేలా పరిస్థితులు తీసుకొస్తున్నామని వివరించారు. లోపల 1.5 లక్షల లీటర్ల సామర్ధం కల్గిన రెండు నీటి సంపులు తవ్వే పనులు జరుగుతున్నాయని, డీజిల్ ఇంజిన్ పంపు పెడుతున్నామని, భూగర్భ అగ్నిమాపక పైప్‌లైన్లను వేస్తున్నామని, 80 ఫైర్ హైడ్రాంట్ పోస్‌తోపాటు రెండు హోస్ రీల్‌లను కల్గిన బాక్సులను అగ్నితో పోరాడటానికి ఉపయోగిస్తామని ఆయన వివరించారు.

ఈ దఫా ప్రతి స్టాల్‌కు అగ్ని మాపకాల పరికరాలను సమకూర్చుతున్నామని, 46 రోజులపాటు స్టాళ్లకు బీమా కల్పిస్తున్నామని వెల్లడించారు. లోపల పలు చోట్ల ఫైరింజిన్లను సిద్ధంగా ఉంచుతామని, అత్యవసర పరిస్థితుల్లో ఫైర్ హైడ్రాంట్ కవాటాలను అపరేట్ చేసేందుకు శిక్షణ పొందిన వాలంటీర్లను నియమిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ దఫా స్టాళ్లలో గ్యాస్ స్టవ్‌ల్‌ను అనుమతించబోమని, అదనంగా గేట్‌లు ఏర్పాటుచేస్తామని, అరు పూర్తిగా బ్యాకప్ ఆటోమేటిక్ డీజిల్ విద్యుత్ జనరేటర్లను ఉంచుతున్నామని ఆయన వివరించారు. గతేడాది అగ్నిప్రమాదంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బాధితులకు నష్ఠ పరిహారం చెల్లించామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ప్రభాశంకర్, ప్రతినిధులు మార్గం ఆశ్విన్ తదితరులు పాల్గొన్నారు.

Priority of public safety in Numaish

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నుమాయిష్‌లో ప్రజల భద్రతకు ప్రాధాన్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.