హాస్టల్ లో నీటి ఎద్దడి…విద్యార్థినుల జుట్టును కత్తిరించిన ప్రిన్సిపాల్

మెదక్ : ఆ గురుకుల పాఠశాల హాస్టల్ లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. దీంతో హాస్టల్ లో ఉండే విద్యార్థినుల జుట్టును కత్తిరించారు. ఈ ఘటన మెదక్ లోని గిరిజన మినీ గురుకుల పాఠశాలలో జరిగింది. విద్యార్థినులు నిండు స్నానం చేసేందుకు ఎక్కువ నీరు అవసరమవుతుందన్న భావనతో ,నీటి కొరతను తగ్గించే క్రమంలో హాస్టల్ లో ఉండే విద్యార్థినుల జుట్టును కత్తిరించాలని ప్రిన్సిపాల్ నిర్ణయం తీసుకుని, వారికి క్రాప్ చేయించింది. ఒకటో తరగతి నుంచి ఆరో […] The post హాస్టల్ లో నీటి ఎద్దడి… విద్యార్థినుల జుట్టును కత్తిరించిన ప్రిన్సిపాల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మెదక్ : ఆ గురుకుల పాఠశాల హాస్టల్ లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. దీంతో హాస్టల్ లో ఉండే విద్యార్థినుల జుట్టును కత్తిరించారు. ఈ ఘటన మెదక్ లోని గిరిజన మినీ గురుకుల పాఠశాలలో జరిగింది. విద్యార్థినులు నిండు స్నానం చేసేందుకు ఎక్కువ నీరు అవసరమవుతుందన్న భావనతో ,నీటి కొరతను తగ్గించే క్రమంలో హాస్టల్ లో ఉండే విద్యార్థినుల జుట్టును కత్తిరించాలని ప్రిన్సిపాల్ నిర్ణయం తీసుకుని, వారికి క్రాప్ చేయించింది. ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు చదివే 180 మంది విద్యార్థినులకు ఆమె జుట్టు కత్తిరించారు. సోమవారం సెలవు దినం కావడంతో తమ పిల్లలను కలిసేందుకు వచ్చిన వారి తల్లిదండ్రులు విద్యార్థినుల జుట్టును కత్తిరించడం చూసి ఆశ్చర్యపోయారు. తమకు సమాచారం ఇవ్వకుండా తమ పిల్లల జుట్టును ఎలా కత్తిరిస్తారంటూ వారు ప్రిన్సిపాల్ ను నిలదీశారు. ప్రిన్సిపాల్ పై చర్య తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Principal Secisers Students Hair Due To Water Crisis

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హాస్టల్ లో నీటి ఎద్దడి… విద్యార్థినుల జుట్టును కత్తిరించిన ప్రిన్సిపాల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: