భారత్‌లోనే 5జి స్పెక్ట్రమ్ రేట్లు ఎక్కువ

అంతర్జాతీయ ధరలతో పోలిస్తే 30, 40 శాతం అధికం: సిఒఎఐ న్యూఢిల్లీ: భారత్‌లో 5జి రేడియో తరంగాల రేట్లు అంతర్జాతీయంగా దక్షిణ కొరియా, అమెరికా వంటి దేశాల్లోని ధరల కంటే 30 నుంచి 40 శాతం ఎక్కువగా ఉన్నాయని సిఒఎఐ (సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) పేర్కొంది. ప్రస్తుత సంవత్సరంలోనే స్పెక్ట్రమ్ వేలం నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసిన మరుసటి రోజు సిఒఎఐ ఈ విధంగా స్పందించింది. మంగళవారం ఇండస్ట్రీ బాడీ నిర్వహించిన 5జి స్పెక్ట్రమ్ […] The post భారత్‌లోనే 5జి స్పెక్ట్రమ్ రేట్లు ఎక్కువ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
అంతర్జాతీయ ధరలతో పోలిస్తే 30, 40 శాతం అధికం: సిఒఎఐ

న్యూఢిల్లీ: భారత్‌లో 5జి రేడియో తరంగాల రేట్లు అంతర్జాతీయంగా దక్షిణ కొరియా, అమెరికా వంటి దేశాల్లోని ధరల కంటే 30 నుంచి 40 శాతం ఎక్కువగా ఉన్నాయని సిఒఎఐ (సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) పేర్కొంది. ప్రస్తుత సంవత్సరంలోనే స్పెక్ట్రమ్ వేలం నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసిన మరుసటి రోజు సిఒఎఐ ఈ విధంగా స్పందించింది. మంగళవారం ఇండస్ట్రీ బాడీ నిర్వహించిన 5జి స్పెక్ట్రమ్ పాలసీ వర్క్‌షాప్‌లో సిఒఎఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ మాట్లాడారు. ‘అంతర్జాతీయంగా ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో 5జి స్పెక్ట్రమ్ రేటు ఎక్కువగా ఉందని చాలావరకు ఆపరేటర్లు భావిస్తున్నారు’ అని ఆయన అన్నారు.

స్పెక్ట్రమ్ రేట్లు ఆపరేటర్లకు సహేతుకమైన ధరలకు లభ్యం కావాలని టెలికామ్ దిగ్గజం వొడాఫోన్ ఇండియా ప్రతినిధి అన్నారు. ప్రస్తుత సంవత్సరంలోనే 5జి, రేడియా తరంగాలకు మెగా స్పెక్ట్రమ్ వేలం నిర్వహించనున్నామని, వచ్చే 100 రోజుల్లో 5జి ట్రయల్స్ ప్రారంభించనున్నామని సోమవారం కేంద్ర టెలికామ్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే మంత్రిత్వశాఖ ఎజెండాలను సిద్ధం చేసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సంక్షోభంలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలైన బిఎస్‌ఎన్‌ఎల్(భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్), ఎంటిఎన్‌ఎల్(మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్)ల పునరుద్ధరణకు ప్రాధాన్యతనిస్తానని అన్నారు.

అయితే ఇరు కంపెనీలు పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలని, వృత్తిపరమైన వైఖరిని అలవర్చుకోవాలని సూచించారు. 5జి ట్రయల్స్‌లోకి చైనా టెలికామ్ సంస్థ హువాయ్‌ను అనుమతించే విషయంపై మంత్రి స్పందించారు. భద్రతా పరణైన అంశాలను తీవ్రంగా పరిగణిస్తామని, వాటిని పరిష్కరిస్తామని అన్నారు. 5జి సేవలతో పాటు 8644 మెగాహెట్జ్ టెలికామ్ ప్రీక్వెన్సీ వేలాన్ని మొత్తం బేస్ ధర రూ.4.9 లక్షల కోట్లుగా ట్రాయ్(టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) సూచించగా, ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన టెలికామ్ సంస్థలు ఈ ధరను భరించలేమంటూ చేతులెత్తేశాయి.

Price of 5G spectrum 30-40% higher than global rates

Related Images:

[See image gallery at manatelangana.news]

The post భారత్‌లోనే 5జి స్పెక్ట్రమ్ రేట్లు ఎక్కువ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: