రామాయణంలోని సిద్ధాంతాలకు అద్దం పడుతున్న అయోధ్య రామాలయం

ఢిల్లీ: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరగడం హర్షణీయమని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. ఈ ఆలయం రామాయణంలోని సిద్ధాంతాలకు, విలువలకు అద్దం పడుతుందని ఆయన పేర్కొన్నారు. చట్టబద్ధంగా నిర్మితమవుతున్న ఈ ఆలయం భారత్ లో మత సామరస్యానికి చిహ్నంగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. రామాలయం భూమి పూజలో పాల్గొన్న వారికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి ట్వీట్ చేశారు. లౌకిక దేశమైన భారత్ లో అన్ని మతాలు, వర్గాల […] The post రామాయణంలోని సిద్ధాంతాలకు అద్దం పడుతున్న అయోధ్య రామాలయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరగడం హర్షణీయమని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. ఈ ఆలయం రామాయణంలోని సిద్ధాంతాలకు, విలువలకు అద్దం పడుతుందని ఆయన పేర్కొన్నారు. చట్టబద్ధంగా నిర్మితమవుతున్న ఈ ఆలయం భారత్ లో మత సామరస్యానికి చిహ్నంగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. రామాలయం భూమి పూజలో పాల్గొన్న వారికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి ట్వీట్ చేశారు. లౌకిక దేశమైన భారత్ లో అన్ని మతాలు, వర్గాల వారకు సమైక్యతను చాటుతూ జీవించడం తరతరాలుగా వస్తుందని ఆయన తెలిపారు. అయోధ్యలోని రామజన్మభూమి రామ్‌లల్లాకే చెందుతుందని గత ఏడాది నవంబర్‌ 9న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఈ ఆలయానికి ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం  భూమిపూజ చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన భారత ప్రజలకు అభినందనలు తెలిపారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post రామాయణంలోని సిద్ధాంతాలకు అద్దం పడుతున్న అయోధ్య రామాలయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: