కశ్మీర్ మార్పులతో సత్ఫలితాలు

  రాష్ట్రపతి కోవింద్ స్వాతంత్య్ర సందేశం మంచి తలపెట్టే చట్టాలతో గట్టి మేలు వైవిధ్య భారతానికి సమిష్టి కలల బంధం న్యూఢిల్లీ : కశ్మీర్‌కు మంచి రోజులు వచ్చాయని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. భారతదేశ 73వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో బుధవారం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ 370వ అధికరణ ఎత్తివేత అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇది మంచి పరిణామమే అని, దీనితో జమ్మూ […] The post కశ్మీర్ మార్పులతో సత్ఫలితాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రాష్ట్రపతి కోవింద్ స్వాతంత్య్ర సందేశం
మంచి తలపెట్టే చట్టాలతో గట్టి మేలు
వైవిధ్య భారతానికి సమిష్టి కలల బంధం

న్యూఢిల్లీ : కశ్మీర్‌కు మంచి రోజులు వచ్చాయని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. భారతదేశ 73వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో బుధవారం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ 370వ అధికరణ ఎత్తివేత అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇది మంచి పరిణామమే అని, దీనితో జమ్మూ కశ్మీర్ ప్రజలకు ఇతోధిక ప్రయోజనాలు సమకూరుతాయని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ లడఖ్‌కు సంబంధించి ఇటీవల పార్లమెంట్ ద్వారా చేసిన మార్పులు చేర్పుల వల్ల అక్కడి పౌరులు తమ హక్కులను ఎప్పటిలాగానే పొందగల్గుతారు. దేశంలోని ఇతర ప్రాంతాల వారికి ఉండే అన్ని అధికారాలను , సకల సౌకర్యాలను సంతరించుకుంటారని రాష్ట్రపతి తెలిపారు. మొత్తం మీద కశ్మీరం జాతి జనజీవన స్రవంతిలో అంతర్భాగం అవుతుందని, రాబోయే మంచి రోజులకు ఇదో సంకేతం అని చెప్పారు. కశ్మీరీలు, జమ్మూవారు, లడఖ్ ప్రాంతీయులు మరిన్ని అవకాశాలను పొందుతారని, ప్రజా సంక్షేమం భవిత కోణంలో ఇదో కీలక నిర్ణయం అన్నారు.

కవితా భారతి అక్షరం నిజమైంది
స్వాతంత్రోద్యమానికి తన కలం ద్వారా బలం చేకూర్చిన ప్రఖ్యాత తమిళ కవి సుబ్రమణ్య భారతి కవితా చరణాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తమ ప్రసంగం సందర్భంగా ఉటంకించారు. వేదాలను ఇటూ శాస్త్రాన్ని మనం అధ్యయనం చేశాం, వీటి స్ఫూర్తితోనే మనం నింగిలోని ఆకాశాన్ని సముద్రాన్ని కూడా అన్వేషిస్తాం . అంతేకాదు చల్లని చందమామ చుట్టూ అల్లుకుని ఉన్న అద్భుత కథలను ఆవిష్కరిస్తాం, అక్కడి లోగుట్టులను ఛేదిస్తాం’ అని కవి ఆనాడే చెప్పారని, ఇప్పుడు భారతీయ ఖ్యాతి ఈ దిశలోనే వెళ్లుతోందని తెలిపారు.

మనం ప్రగతి కోసం పాటుపడాలని, పరిశుభభ్రత కోసం కలిసి సాగాలని పిలుపు నిచ్చారు. మనకు స్వాతంత్య్రం అందించి వెళ్లిపోయిన తరం వారు స్వాతంత్య్రాన్ని కేవలం రాజకీయాథికార బదిలీగానే చూడలేదని, అంతకు మించిన విశిష్ట అంశాల కోణంలో మన దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చారని చెప్పారు. స్వాతంత్య్రం అనేది మన జాతి నిర్మాణంలో , పురోగమనంలో ఒక చుక్కాని అనే ఆలోచనతో ఈ దిశలో వారి కృషి సాగిందని తెలిపారు. దేశ ప్రగతి అనేది సుదీర్ఘ ప్రక్రియ అని, దీనిని సాధించుకున్నప్పుడే మన దేశ స్వాతంత్య్ర ప్రదాతల ఆశయాలను సార్థకం చేసినవారమవుతామన్నారు.

తలాక్ రద్దు బిల్లు పురోగామ చర్య
ఇటీవలి కాలంలో పార్లమెంట్‌లో నిర్మాణాత్మక బిల్లులు వచ్చాయని రాష్ట్రపతి ప్రస్తావించారు. అవసరాలకు అనుగుణంగా అవసరమైన చట్టాలను తీసుకురావడం రాజ్యాంగ పరిపుష్టతకు మేలు కల్గిస్తుందన్నారు. కొత్త చట్టాలు , సవరణలు ఇప్పటివరకూ ఉన్న ఏర్పాట్ల ప్రక్షాళన వంటివి అవసరమే అని తెలిపారు. ఓ వైపు జమ్మూ కశ్మీర్‌పై కీలక నిర్ణయం, ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హ నేరంగా చేసే చట్టం తీసుకురావడం వల్ల మన బిడ్డలకు భావితరాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రగతి పురోగామ, చైతన్యయుత చట్టాలతో, విద్యాహక్కు వంటివి కీలకమైన అంశాలని తెలిపారు. అణగారిన వర్గాల సాధకబాధకాలను తెలుసుకునిస్పందించే దయార్థ్ర స్పందన గల దేశం భారత్ అని, ఈ వారసత్వాన్ని ఇక ముందు కూడా కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

17వ సార్వత్రిక ఎన్నికలలో ఓటర్లు ఇతోధిక ఉత్సాహంతో పాల్గొని తమ ఓటు హక్కు ద్వారా ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ప్రజాస్వామిక దేశంగా భారత్ ఘనతను చాటిచెప్పారని రాష్ట్రపతి కొనియాడారు. కొత్త పార్లమెంట్ ఏర్పడిన తరువాత జరిగిన పార్లమెంట్ సెషన్ సముచిత ఉత్పాదక ఫలితాన్ని అందించిందని తెలిపారు. పలు కీలక బిల్లులు నిర్మాణాత్మక చర్చలు, పార్టీలకు అతీత సహకార స్ఫూర్తితో సాగాయని , దీనితో సరైన ఫలం దక్కిందన్నారు. రాష్ట్రపతిగా తాను దేశమంతటా తిరిగానని, మన ప్రజలు భిన్న రుచుల, అభిరుచులతో విడివిడిగానే కన్పిస్తారని అయితే కలల విషయంలో వారంతా ఒక్కటే అని, ఆ కలల సాకారమే దేశ స్వాతంత్య్ర దినోత్సవ సందేశం కావాల్సి ఉందన్నారు.

President greets people on the eve of Independence Day

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కశ్మీర్ మార్పులతో సత్ఫలితాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: