యాదాద్రి దేవుడికి బంగారు పూలు వెండి పళ్లెం…

silver platter gold flowers

 

తొలి ఏకాదశి సందర్భంగా సమర్పించిన జ్యుయలరీ యజమాని

యాదాద్రి : యాదాద్రీశుడు శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి బంగారంతో చేసిన 108 పుష్పాలు, కిలో వెండి పళ్ళెంను హైద్రాబాద్‌కు చెందిన రూపసంతోషిని జ్యువెల్లరీ యజమాని శారద కుటుంబ సభ్యులు స్వామి వారికి బహుకరించారు. శుక్రవారం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి వారి దర్శనార్థం వచ్చిన వారు గ్రాము బంగారంతో ఒక్కో పుష్పం చొప్పున 108 పుష్పాలను మొత్తం 108 గ్రాముల బంగారంతో తయారు చేయించి స్వామి వారి పుష్పార్చన పూజకు ఉపయోగించే విధంగా కిలో వెండితో తయారు చేసినటువంటి వెండి పళ్ళెంను జ్యువెల్లరీ దుకాణ యజమాని యాదాద్రి దేవస్థాన ఈఓ గీత, అర్చకులు అందచేశారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్న దాత భక్త కుటుంబానికి అర్చకులు స్వామి వారి ఆశీర్వచనంతో పాటు తీర్ధ ప్రసాదాన్ని అందచేశారు.

Presentation of silver platter gold flowers to God

Related Images:

[See image gallery at manatelangana.news]

The post యాదాద్రి దేవుడికి బంగారు పూలు వెండి పళ్లెం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.