ముస్తాబవుతున్న ‘మన్మథుడు 2’…

  నాగార్జున, రకుల్‌ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘మన్మథుడు 2’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్, వయాకామ్ 18స్టూడియోస్ పతాకాలపై నాగార్జున, పి.కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. చైతన్య భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ […] The post ముస్తాబవుతున్న ‘మన్మథుడు 2’… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నాగార్జున, రకుల్‌ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘మన్మథుడు 2’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్, వయాకామ్ 18స్టూడియోస్ పతాకాలపై నాగార్జున, పి.కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. చైతన్య భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ఆడియో వేడుకను త్వరలో నిర్వహించడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక మంగళవారం ఈ సినిమాలో అవంతిక పాత్రలో నటించిన రకుల్‌ప్రీత్ సింగ్ క్యారెక్టర్‌ను ప్రోమో రూపంలో విడుదల చేశారు. లక్ష్మీ, వెన్నెల కిషోర్, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః ఎం.సుకుమార్, స్క్రీన్‌ప్లేః రాహుల్ రవీంద్రన్, సత్యానంద్, ఎడిటర్స్‌ః ఛోటా కె.ప్రసాద్, బి.నాగేశ్వర రెడ్డి, డైలాగ్స్‌ః కిట్టు విస్సా ప్రగడ, రాహుల్ రవీంద్రన్.

Preparing for Release of Manmadudu 2

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ముస్తాబవుతున్న ‘మన్మథుడు 2’… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.