మున్సి‘పోల్స్’కు సిద్ధం…

  జులైలో నోటిఫికేషన్ విడుదల కొత్త మున్సిపాలిటీలు, పెరిగిన వార్డులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రేటర్ వరంగల్‌తో పాటు తొమ్మిది మున్సిపాలిటీలకు ఎన్నికలు వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకొని జులై, ఆగస్టులో ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు చేసుకుంటుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మున్సిపాలిటీలకు, వాటితో పాటు ఉన్నటువంటి మున్సిపాలిటీలు వార్డుల సంఖ్యను పెంచిన గెజిట్‌ను శుక్రవారం విడుదల చేసింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీతో […] The post మున్సి‘పోల్స్’కు సిద్ధం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జులైలో నోటిఫికేషన్ విడుదల
కొత్త మున్సిపాలిటీలు, పెరిగిన వార్డులు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రేటర్ వరంగల్‌తో పాటు తొమ్మిది మున్సిపాలిటీలకు ఎన్నికలు

వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకొని జులై, ఆగస్టులో ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు చేసుకుంటుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మున్సిపాలిటీలకు, వాటితో పాటు ఉన్నటువంటి మున్సిపాలిటీలు వార్డుల సంఖ్యను పెంచిన గెజిట్‌ను శుక్రవారం విడుదల చేసింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీతో తొమ్మిది మున్సిపాలిటీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వార్డుల విభజన, కొత్త వార్డుల పెంపు 2019 పార్లమెంట్ ఎన్నికల ఓటర్ల లిస్ట్ ఆధారంగా ఓటర్ల సంఖ్యను పేర్కొంది.

అయితే పెరిగిన వార్డులతో పాటు వార్డుల విభజన 20 రోజుల్లో స్థానిక అధికారులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆప్రక్రియ ముగిసిన వెంటనే జులై 20న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి 25 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఆగస్టు మొదటి వారంలోనే మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్నిరకాలుగా సిద్ధమైంది. అందుకు సంబంధించిన జిఒను ముఖ్యమంత్రి శుక్రవారం గవర్నర్‌కు పంపి ఎన్నికల కమిషన్‌కు సిఫారసు చేసినట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు తొమ్మిది మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.

వాటిలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలలో నర్సంపేట, మహబూబాబాద్, భూపాలపల్లి, పరకాల, జనగాం మున్సిపాలిటీలు గతంలో ఉండగా కొత్త వాటిలో తొర్రూరు, వర్ధన్నపేట, మర్రిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తం పది మున్సిపాలిటీలకు ఉమ్మడి జిల్లాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్న ఎంఎల్‌ఎలంతా శుక్రవారం నుండే కసరత్తును ముమ్మరం చేశారు. పెరిగిన వార్డులు, వార్డుల విభజన, పోటీచేసే అభ్యర్థులు, రిజర్వేషన్లు తదితర వాటిపై టిఆర్‌ఎస్ పార్టీ ఎంఎల్‌ఎలు నియోజకవర్గాల వారిగా సమీక్షలను నిర్వహించుకున్నారు. దానికి సంబంధించి పూర్తిస్థాయిలో ఎన్నికల ఇన్‌చార్జ్‌లు, అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

మున్సిపాలిటీలో ఉన్న ఓట్లు..పెరిగిన డివిజన్ల సంఖ్య..

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాత మున్సిపాలిటీలతో పాటు గ్రామపంచాయతీల నుండి కొత్తగా మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ అయిన వాటిలో కూడా వార్డుల సంఖ్య పెరిగింది. జనగాం, మున్సిపాలిటీల్లో 52 వేల 702 మంది ఓటర్లు ఉండగా గతంలో 28 వార్డులుంటే ఈ ఎన్నికల్లో 30 వార్డులుగా చేశారు. జనగాంలో కొత్తగా రెండు వార్డులను పెంచడం వల్ల ఆ సంఖ్య 30కి చేరింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 8 లక్షల 99 వేల 406 మంది ఓటర్లు ఉండగా 58 డివిజన్లు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ ఎనిమిది డివిజన్లను పెంచారు. దాని సంఖ్య ఈ ఎన్నికల్లో 66 డివిజన్లకు చేరింది. పరకాల మున్సిపాలిటీలో 24 లక్షల 444 ఓటర్లు ఉండగా 20 వార్డులకు రెండు వార్డులు పెంచి 22 వార్డులను చేశారు.

నర్సంపేట మున్సిపాలిటీలో 37 వేల 70 మంది ఓటర్లు అన్నారు. ప్రస్తుతం 20 వార్డులుండగా అక్కడ కూడా 4 వార్డులను పెంచి 24 వార్డులకు ఎన్నికలు జరిగే విధంగా పెంచారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో 68 లక్షల 935 మంది ఓటర్లు ఉండగా 28 వార్డులకు 36 వార్డులను చేశారు. డోర్నకల్ నియోజకవర్గ కేంద్రమైనప్పటికి అక్కడి గ్రామపంచాయతీ కొత్తగా మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. డోర్నకల్ మున్సిపాలిటీలో 19 వేల 425 మంది ఓటర్లు ఉండగా 7 వార్డులకే పరిమితమైతే అక్కడ ఎనిమిది వార్డులను పెంచి 15 వార్డులకు పెంచారు. మర్రిపెడ గ్రామపంచాయతీ నుండి మున్సిపాలిటీకి అప్‌గ్రేడ్ అయింది. అక్కడ 17 వేల 685 మంది ఓటర్లు ఉండగా తొమ్మిది వార్డులకు 15 వార్డులకు పెంచారు.

తొర్రూరు గ్రామపంచాయతీ నుండి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. అక్కడ 19 వేల 100 ఓటర్లు ఉండగా తొమ్మిది వార్డులకు 16 వార్డులను పెంచారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో 59 వేల 458 మంది ఓటర్లుండగా 20 వార్డులున్న మున్సిపాలిటీల్లో 10 వార్డులను పెంచి 30 వార్డులకు చేశారు. వర్ధన్నపేట గ్రామపంచాయతీ నుండి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. 13 వేల 732 మంది ఓటర్లు ఉండగా ఏడు వార్డుల నుండి 12 వార్డులకు పెంచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెరిగిన వార్డుల విభజన కూడా జరగనుంది. దీనిపై అధికారులు పూర్తిస్థాయి కసరత్తును మొదలు పెట్టారు.

Prepare for Municipal Elections

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మున్సి‘పోల్స్’కు సిద్ధం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.