ఆహా ఏమి రుచి…!

  పెద్దపెద్ద హోటల్స్‌కి వెళ్తే అక్కడ మెన్యూలో కనిపించేవి మనం ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. రెసిపీ తెలుసుకుంటే అంతకంటే చక్కగా తయారుచేయొచ్చు. పెద్దలు ,పిల్లలూ లొట్టలేసుకుంటూ తింటారు. పుల్కా, పరోటాల్లో ఈ కూరలు చాలా టేస్ట్‌గా ఉంటాయి. మీరూ ప్రయత్నించండి. ఎంతైనా ఇంటి వంట రుచే మధురం కదా! కశ్మీరీ దమ్‌ఆలూ కావాల్సిన పదార్థాలు: చిన్న బంగాళా దుంపలు 500గ్రా॥, పెరుగు 250గ్రా॥, ఆవనూనె15 గ్రా॥, కశ్మీరీ కారంపొడి 10 గ్రా॥, ధనియాల పొడి 10గ్రా॥, […] The post ఆహా ఏమి రుచి…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పెద్దపెద్ద హోటల్స్‌కి వెళ్తే అక్కడ మెన్యూలో కనిపించేవి మనం ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. రెసిపీ తెలుసుకుంటే అంతకంటే చక్కగా తయారుచేయొచ్చు. పెద్దలు ,పిల్లలూ లొట్టలేసుకుంటూ తింటారు. పుల్కా, పరోటాల్లో ఈ కూరలు చాలా టేస్ట్‌గా ఉంటాయి. మీరూ ప్రయత్నించండి. ఎంతైనా ఇంటి వంట రుచే మధురం కదా!

కశ్మీరీ దమ్‌ఆలూ

కావాల్సిన పదార్థాలు: చిన్న బంగాళా దుంపలు 500గ్రా॥, పెరుగు 250గ్రా॥, ఆవనూనె15 గ్రా॥, కశ్మీరీ కారంపొడి 10 గ్రా॥, ధనియాల పొడి 10గ్రా॥, సోంప్‌పౌడర్1 చిన్న చెమ్చా, జీలకర్రపొడి1 చిన్న చెమ్చా, జీలకర్ర అర చిన్న చెమ్చా, గరం మసాలా అర చిన్న చెమ్చా, యాలకుల పొడి చిటికెడు, పచ్చిమిర్చి తరిగినవి2, ఉల్లిపాయలు 50 గ్రా॥, కరివేపాకులు 2 రెబ్బలు, వెల్లుల్లి పేస్టు1 చిన్న చెమ్చా, అల్లం పేస్ట్ 1 చిన్న చెమ్చా, టొమాటో ప్యూరీ10 గ్రా॥, కొత్తిమీర ఆకులు కొన్ని
(గార్నిషింగ్ కోసం), ఉప్పు రుచికి తగినంత.

తయారీ విధానం: ఆలుగడ్డలను కడిగి కుక్కర్‌లో ఉప్పు వేసి ఉడికించాలి. తర్వాత తొక్క తీసి పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో ఆవనూనె వేసి వేడి చేయాలి. జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. తర్వాత అందులో కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేయాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు బంగాళదుంపలు వేసి ఫ్రై చేయాలి. తర్వాత పెరుగు వేసి ఉడికించాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ధనియాల పొడి, సోంపు పౌడర్, కారంపొడి, జీలకర్ర పొడి, యాలకుల పొడి వేసి వేయించాలి. తర్వాత టొమాటో ప్యూరీ వేసి ఫ్రై చేయాలి. నూనె పైకి వచ్చే సమయంలో గరం మసాలా వేసి వేయించాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి.

 

మటర్ మేథీమలై

కావాల్సినవి: మెంతి ఆకులు-300 గ్రా॥, మీగడ 100 గ్రా॥, మిరియాలు1 చిన్న చెమ్చా, అల్లం పేస్టు 1 చిన్న చెమ్చా, పచ్చిమిర్చి 2, బిర్యాని ఆకులు2, కాజు పేస్టు 10 గ్రా॥, క్రీమ్ కొంచెం, గరం మసాలా1 చిన్న చెమ్చా, నూనె1 పెద్ద చెమ్చా, పసుపుచిటికెడు, ఉప్పు రుచికి తగినంత.

తయారీ విధానం : మెంతి ఆకులను శుభ్రం చేసి వాటిని పచ్చిమిర్చితో కలిపి రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేడి చేసి అందులో అల్లం, వెల్లుల్లి పేస్టు వేసి రెండు నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఈ మిశ్రమంలో కాజు పేస్టు, పసుపు, కారంపొడి, బిర్యానీ ఆకులు, మిరియాలు, ఉప్పు వేయాలి. తర్వాత వాటిని మెంతి మిశ్రమంలో వేసి కాసేపు ఉడికించాలి. ఇందులో కొన్ని నీళ్లు పోసి కాసేపు ఉడికించాలి. ఇప్పుడు ఇందులో గరం మసాలా, బఠాణీలు, మీగడ వేసి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించాలి. క్రీమ్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

 

ముల్లంగి మలైకోఫ్తా

కావలసిన వస్తువులు : ముల్లంగి 500గ్రా॥, బంగాళదుంపలు 150 గ్రా॥, ఉల్లిపాయ (చిన్నది)1, గరం మసాలా అర చిన్న చెమ్చా, కారంపొడి అర చిన్న చెమ్చా, వాము చిటికెడు, శనగపిండి 23 పెద్ద చెమ్చాలు.
గ్రేవీకి కావలసిన వస్తువులు: వెల్లుల్లి23 రెబ్బలు, అల్లం1 చిన్న ముక్క, ఉల్లిపాయలు2, టొమాటో ప్యూరీ 50 గ్రా॥, అక్రోట్‌లు2, కాజు4, యాలకుల పొడి1 చిన్న చెమ్చా, ధనియాల పొడి 1 పెద్ద చెమ్చా, జీలకర్ర పొడి అర చిన్న చెమ్చా, నూనె 2 పెద్ద చెమాలు, మలై 50 గ్రా॥ బిర్యానీ ఆకు 2, ఉప్పు రుచికి తగినంత.

తయారీ విధానం: ముల్లంగి, ఉల్లిపాయలను కలిపి తురమాలి. అందులో బంగాళాదుంపలు, శనగపిండి, ఉప్పు, సగం గరం మసాలా, సగం కారంపొడి, వాము వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని కోఫ్తాల్లా చేసి డీప్ ఫ్రై చేయాలి. అక్రోట్, కాజులను 23 నిమిషాల పాటు నీళ్లలో నానబెట్టాలి. ఆ తర్వాత వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయలు, కాజు, అక్రోట్‌ల పేస్టు తయారు చేయాలి. ఒక పాన్‌లో నూనె వేడి చేసి, అందులో టొమాటో ప్యూరీ, ధనియాల పొడి, యాలకుల పొడి, జీలకర్ర పొడి, కారంపొడి, గరం మసాలా, ఉప్పు వేసి ఫ్రై చేయాలి. ఈ మిశ్రమంలో కాస్త నీళ్లు పోసి గ్రేవీని ఉడికించండి. గ్రేవీ రెడీ అయ్యాక అందులో కోఫ్తాలు వేయడమే.

 

బీట్‌రూట్ భర్తా

కావలసిన వస్తువులు: బీట్‌రూట్ 500 గ్రా॥, ఉల్లిపాయలు2, టొమాటో2, అల్లం ముక్క 1, వెల్లుల్లి రేకలు5, ఇంగువ చిటికెడు, పసుపు అర చిన్న చెమ్చా, కారంపొడి అర చిన్న చెమ్చా, ధనియాల పొడి అర చిన్న చెమ్చా, గరం మసాలా అర చిన్నచెమ్చా, చక్కెర అర చిన్న చెమ్చా, నెయ్యి1 పెద్ద చెమ్చా
(గార్నిషింగ్ కోసం), నూనె 1 చిన్న చెమ్చా, కొత్తిమీర ఆకులు కొన్ని
(గార్నిషింగ్ కోసం), ఉప్పు రుచికి తగినంత.

తయారు చేసే పద్ధతి: బీట్‌రూట్‌లను కొన్ని నీళ్లలో ఉడికించి, మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, టొమాటోలు, వెల్లుల్లి, అల్లంను పేస్టులా చేసుకోవాలి. ఒక గిన్నెలో నూనె వేడి చేసి, ఉల్లిపాయ మసాలాను వేయించాలి. తర్వాత అందులో ఉప్పు, ధనియాల పొడి,
పసుపు, కారంపొడి వేయాలి. తర్వాత బీట్‌రూట్ వేసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమంలో నీళ్లు, గరంమసాలా వేయాలి. కాస్త చెక్కర వేసి, మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆవిరి రాగనే మూత తీసి, నెయ్యి, కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.

Preparation of Delicious Dishes

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆహా ఏమి రుచి…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.