వేసవిలో గర్భిణిలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నిజామాబాద్ : ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఏప్రిల్ ప్రారంభంలోనే ఇలా ఉంటే మే వచ్చే సరికి పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఇప్పటి నుంచే భీతిల్లిపోతున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండ తీవ్రతను తట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది గర్భిణీల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. సాధారణంగానే వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికితోడు ఉక్కపోత, చమట వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో డీహైడ్రేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదుకే, వేసవిలో వేడి పెరుగుతున్న […] The post వేసవిలో గర్భిణిలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నిజామాబాద్ : ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఏప్రిల్ ప్రారంభంలోనే ఇలా ఉంటే మే వచ్చే సరికి పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఇప్పటి నుంచే భీతిల్లిపోతున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండ తీవ్రతను తట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది గర్భిణీల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. సాధారణంగానే వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికితోడు ఉక్కపోత, చమట వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో డీహైడ్రేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదుకే, వేసవిలో వేడి పెరుగుతున్న కొద్దీ ఆహార అలవాట్లను సైతం మార్చుకోవాలని వైద్య, ఆహార నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయి, ఎండతాకిడికి వడదెబ్బ లాంటివి తగిలితే.. గర్బిణీలకు మరింత ప్రమాదకరంగా మారుతుంది. దుస్తుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు.
ఎండాకాలంలో దాహం వేసినా వేయకున్నా గర్భిణీలు వీలైనన్ని ఎక్కువ సార్లు నీరు తాగాలి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత్తలు సమతుల్యంగా ఉండడంతో పాటు డీహైడ్రేషన్ బారినపడకుండా కాపాడుకోవచ్చు.
* సాధారణంగా గర్భిణీల్లో పాదాలు, కాళ్ళ వాపు తీవ్రంగా ఉంటుంది. వేసవిలో ఇది మరింత తీవ్రంగా ఉంటుంది. కూర్చున్నప్పుడు దిండుపై కాళ్ళు పెట్టుకోవడం ద్వారా పాదాలపై ఒత్తిడి తగ్గుతుంది. ఉప్పు తక్కువగా తీసుకోవాలి. వాపు అలాగే కొనసాగితే వైద్యులను సంప్రదించాలి.
* సూర్యకిరణాలు నేరుగా పడకుండా చూసుకోవాలి. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో తల నొప్పి, పాదాల వాపు, డీహైడ్రేషన్ బారిన పడతారు.
* ఉదయం సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తరువాత కాసేపు నడవాలి. కేవలం మంచానికే పరిమితం కాకుండా వైద్యులు సూచించిన వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాలి.
* ఈత కొట్టడం గర్భిణీలకు మంచి వ్యాయామం. ఇది శరీరానికి చల్లదనంతో పాటు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. చాలా ఆరోగ్యంగా ఉంటుంది.
* అన్ని రకాల మసాల, వేపుళ్లకు దూరంగా ఉండాలి. కార్పొహైడ్రేట్లు, పోషకాలు ఎక్కువగా ఉన్న తాజా కూరగాయలు, పండ్లను తినాలి. వేసవిలో దోసకాయలు తీసుకుంటే మంచిది. ప్రణాళిక ప్రకారం నిర్ధేశిత సమయాల్లో కచ్చితంగా ఆహారం తీసుకోవాలి. గర్భాధారణ సమయంలో తినే ఆహారంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో తీసుకున్న ఆహారమే ఆ శిశువుకు ప్రధాన పోషకాహారంగా ఉంటుంది. తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, కొవ్వు, కార్పొహైడ్రేట్లు, ఇనుము, పోలిక్ ఆమ్లం, కాల్షియం, విటమిన్లలతో సహా అన్ని పోషకాలు ఉండాలి.
* మాంసం తిననివారు, వాటి స్థానంలో తృణధాన్యాలు, పప్పులు, గింజలు తీసుకోవాలి.
* కూరగాయలు, పండ్లు కాల్షియం, ఖనిజాలు, ఫైబర్‌ను అందిస్తాయి.
* మాంసం, చేపలు ప్రొటీన్లు ఇస్తాయి.
* నీరు, తాజాపండ్ల రసాలతో గర్భిణీలకు కావాల్సిన ద్రవాలు అందుతాయి.
* అన్ని రకాల గింజలు, కూరగాయలు తీసుకుంటే, ఫైబర్, ప్రొటీన్లు, ఇనుము, కాల్షియం, జింక్ శరీరానికి అందుతాయి.
* గింజలు, వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల పూర్తిస్థాయిలో ఖనిజాలు, విటమిన్ ఇ ఫైబర్, ఫ్రొటీన్స్ ఉంటాయి.
* ముదురు తెలుపు బీన్స్, బఠాణీలు, సోయాబీన్స్ తదితరాలతో సూప్స్, సలాడ్ వంటివి తీసుకోవాలి.
* సంపూర్ణ సమృద్ధమైన ధాన్యంతో కాల్చిన రొట్టెలు, తృణధాన్యాలు, ఫోలిక్ ఆమ్లము, ఖనిజాలకు గొప్ప వనరుగా ఉన్నాయి. ఉదయం అల్ఫాహారంలో ఓట్‌మిల్, మద్యాహ్నం భోజనం, సాయంత్రం ముదురు బియ్యంతో అన్నం తినాలి.
* గుడ్డు, కడుపులో బిడ్డకు అవసరమైన అమైనో ఆమ్లాను అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇందులో డజనుకుపైగా విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. మెదడు ఎదుగుదలకు మంచిది.
* తక్కువ కొవ్వు కలిగిన పెరుగు ఒక కప్పు పాల కంటే ఎక్కువగా కాల్షియం, ప్రొటీన్లు ఇస్తుంది. తృణధాన్యాలతో కలిపి తింటే ఎముకల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. రోజూ ఉదయం, సాయంత్రం పాలు తాగాలి.
* ఆకు కూరలు, కూరగాయలు తీసుకోవడంతో విటమిన్ సి.ఏ.కె. ఫోలెట్ వంటి గొప్ప పోషకాలు ఉంటాయి.
* అరటిపండులో పోటాషియం సమృద్ధిగా ఉంటుంది. గర్భిణీలకు తక్షణ శక్తిని ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది. వికారాన్ని తగ్గిస్తుంది.
* బత్తాయి రసం తీసుకుంటే అందులో 90శాతం నీరు ఉండటంతో శరీరానికి కావాల్సిన ద్రవాలు అందుతాయి.
* ఎండు ఫలాలు తీసుకోవడం వల్ల మూత్ర సంబంధిత రోగాలు తగ్గుతాయి.
* పుట్టే బిడ్డపై ప్రభావం పడకుండా వేసవిలో గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా.. అవి బిడ్డపైనా ప్రభావం చూపుతాయనే విషయం గుర్తుంచుకోవాలి. నీటి పరిమాణం తగ్గకుండా, అదికూడా కాచి వడపోచి చల్లార్చుకుని తాగడం ఆరోగ్యకరం. వేసవిలో వచ్చే కర్బూజ, పుచ్చకాయ వంటివి ఎక్కువగా తింటూ ఉండాలి. పౌష్టికాహారం, పండ్లు, కూరగాయలు, రోజువారీ ఆహారంలో తీసుకోవాలి. ఎండ సమయంలో వీలైనంత వరకూ బయటకు రాకుండా ఉండాలి.
* ముదురు రంగు, సిల్క్ దుస్తులకు దూరంగా ఉండాలి. లేత రంగు దుస్తులను ధరించాలి. తెలుపు రంగు అయితే ఉత్తమం, బిగుతుగా ఉండే దుస్తులను వేసుకోకూడదు. శ్వాసకు ఇబ్బంది కలగకుండా ఉండేలా ప్రసూతి గౌన్లు, నైటీలు లాంటివి వేసుకుంటే మంచిది. గర్భిణీలు దుస్తుల విషయంలో ఫ్యాషన్లంటూ ప్రయోగాలు చేయకపోవడమే మేలు. బయటకు వెళ్ళేటప్పుడు స్కార్ప్ కట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు ఎండలో వెళ్ళొద్దు. పొడవాటి జుట్టు మంచిదని ఫ్యాషన్‌రంగ నిపుణులు సూచిస్తున్నారు.

Precautions to Pregnancy Women in Summer

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వేసవిలో గర్భిణిలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: