అమెరికా రోడ్డు ప్రమాదంలో ప్రత్యూష్ చంద్ర మృతి

 road accident

 

ఖమ్మం : సీపీఐ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు స్వర్గీయ నల్లమల గిరిప్రసాద్ మనుమడు ప్రత్యూష్ చంద్ర(34) ఆదివారం అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన క్షతగాత్రున్ని ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యం పొందుతూఆదివారం సాయంత్రం మృతి చెందాడు. గిరిప్రసాద్ కుమార్తె వనశ్రీ, అల్లుడు, కంటి వైద్యులు డాక్టర్ సుదర్శన్‌రెడ్డి కుమారుడైన ప్రత్యూష్ చంద్ర తన స్నేహితులతో కలిసి అమెరికాలో కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని మృతుని బందువులు తెలిపారు.

ప్రత్యూష్ చంద్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ రెవెన్యూశాఖ మంత్రి, మాజీ ఎంపీ, పీసీసీ మాజీ అధ్యక్షులు పి.నర్సారెడ్డికి మనుమడు. ప్రత్యూష్ చంద్ర తల్లిదండ్రులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మృతుని తల్లిదండ్రులతో పాటు బందువులు అమెరికాకు బయలుదేరి వెళ్లారు. ఆయన అంత్యక్రియలు హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఆయన భౌతికకాయాన్ని స్వదేశానికి పంపించేందుకు అమెరికా రాయబార కార్యాలయ ప్రత్యేక బృందం ఏర్పాట్లు చేస్తుంది. మరణ వార్త తెలియగానే అతని బందువులు శోకసంద్రలో రోదిస్తున్నారు.

Pratyush Chandra’s death in US road accident

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అమెరికా రోడ్డు ప్రమాదంలో ప్రత్యూష్ చంద్ర మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.