నిరుపేదలకు గూడు కలిపించడమే లక్ష్యం : ప్రశాంత్ రెడ్డి

Prashant Reddyనిజామాబాద్ : తెలంగాణలోని నిరుపేదలకు గూడు కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం డిచ్ పల్లి మండలం బీబీపూర్ తాండలో శుక్రవారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను  ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కెసిఆర్ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే అన్ని కులాల్లో ఉన్న నిరుపేదలకు గూడు కలిపించాలన్న సదుద్ధేశంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎ బాజిరెడ్డి గోవర్ధన్, ఎంఎల్ సి విజి గౌడ్, జిల్లా కలెక్టర్ ఎంఆర్ ఎం రావు, జడ్ పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Prashant Reddy Launches Double Bedroom Houses

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నిరుపేదలకు గూడు కలిపించడమే లక్ష్యం : ప్రశాంత్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.