వరంగల్ పార్లమెంటరీ రిటర్నింగ్ అధికారిగా కలెక్టర్ ప్రశాంత్‌జెపాటిల్

  వరంగల్: లోక్‌సభ ఎన్నికలకు శాసనసభ నియోజక వర్గాల వారిగా ఎలక్షన్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను రూపొందించాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జెపాటిల్ కోరారు. 15-వరంగల్(ఎస్సి) పార్లమెంటరీ నియోజకవర్గానికి నిర్వహిస్తున్న ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు. ఈ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ స్థానాలకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా ఆయా శాసనసభ నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు పని చేస్తారు. లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా మంగళవారం […]

 

వరంగల్: లోక్‌సభ ఎన్నికలకు శాసనసభ నియోజక వర్గాల వారిగా ఎలక్షన్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను రూపొందించాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జెపాటిల్ కోరారు. 15-వరంగల్(ఎస్సి) పార్లమెంటరీ నియోజకవర్గానికి నిర్వహిస్తున్న ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు. ఈ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ స్థానాలకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా ఆయా శాసనసభ నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు పని చేస్తారు. లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ నందు నిర్వహించిన సమావేశంలో వరంగల్ రూరల్ కలెక్టర్ ఎం.హరిత, జనగాం కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి, భూపాలపల్లి కలెక్టర్ డాక్టర్ బి.వెంకటేశ్వర్లతో పాటు వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పోలీంగ్‌కు ఆటంకం కలిగించే వ్యక్తులను గుర్తించి సమస్యాత్మక పోలీంగ్ కేంద్రాలను మ్యాపింగ్ చేయాలని అందుకు మందుగానే పోలింగ్ కేంద్రాల వారిగా కమ్యూనికేషన్ ప్రణాళికను రూపొందించాలని తెలిపారు. పోలీంగ్ మెటీరియల్ పంపిణీ, రిసెప్షన్ కేంద్రాల ప్రతిపాదనలను పంపాలని తెలిపారు. మొత్తం కౌంటింగ్ ప్రక్రియ వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు నందు జరుగుతుంది. పోలింగ్ సిబ్బంది ఫస్ట్ ర్యాండమైజేషన్ ప్రక్రియను వెంటనే చేపట్టారు. అలాగే 1, 2 దశలలో శిక్షణకు షెడ్యూల్‌ను రూపొందించాలని పోస్టల్ బ్యాలెట్ల పంపిణీకి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అన్నిరకాల ఎన్నికల ప్రచార అనుమతులను రిటర్నింగ్ అధికారి స్థాయిలోనే ఇచ్చేందుకు వరంగల్ కలెక్టరేట్ నందు సువిధకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ముందుగానే అనుమతుల వివరాలు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు పంపించారు. అభ్యర్థుల ప్రచార ఖర్చులను నమోదు చేసే పనులను సమన్వయ పరిచేందుకు అసిస్టెంట్ ఎక్స్‌పెండీచర్ అబ్జర్వర్లను నియమించుకోవాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో ములుగు జిల్లా కలెక్టర్ సిహెచ్.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Prashant J. patil as the Warangal Parliamentary Returning Officer

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: