ప్రాణహాని ఉంది.. రక్షణ పెంచండి: అమృత

నల్గొండ: పట్టపగలు అందరూ చూస్తుండగానే నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గతేడాది సెప్టెంబర్ 14వ తేదీన పెరుమాళ్ళ ప్రణయ్(25) అనే యువకుడిని దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపేసిన సంగతి తెలిసిందే. ఈ హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. కాగా, ప్రణయ్ హత్య కేసులో నిందితులకు హైకోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. దీనిపై ప్రణయ్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తన భర్తను దారుణంగా హత్య చేయించిన నిందితులకు బెయిల్ దొరకడంపై ప్రణయ్ […] The post ప్రాణహాని ఉంది.. రక్షణ పెంచండి: అమృత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నల్గొండ: పట్టపగలు అందరూ చూస్తుండగానే నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గతేడాది సెప్టెంబర్ 14వ తేదీన పెరుమాళ్ళ ప్రణయ్(25) అనే యువకుడిని దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపేసిన సంగతి తెలిసిందే. ఈ హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. కాగా, ప్రణయ్ హత్య కేసులో నిందితులకు హైకోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. దీనిపై ప్రణయ్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తన భర్తను దారుణంగా హత్య చేయించిన నిందితులకు బెయిల్ దొరకడంపై ప్రణయ్ భార్య ప్రధాన నిందితుడు మారుతీరావు కుమార్తె అమృత  ఆవేదన వ్యక్తం చేసింది. పట్టపగలు నడిరోడ్డుపై హత్య చేసిన వారిని బెయిల్ పై విడుదల చేయడం దారుణమని వాపోయింది. నిందితులు బయటకు రావడం వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆమె ఆరోపించింది. తమకు రక్షణ పెంచాలని డిమాండ్ చేసింది.

ఇప్పటికీ తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తన భర్త కేసులో ఏ2 నిందితుడు బాబాయ్ శ్రవణ్ కుమార్ భార్య ఇప్పటికీ ఫోన్లు చేయిస్తూ బెదిరింపులకు పాల్పడుతోందని అమృత తెలిపింది. బయట ఉన్న తన చిన్నమ్మనే అంత కక్షతో ఉంటే లోపల ఉండి బయటకు వస్తున్న వారు మరింత కక్ష పెంచుకునే అవకాశం ఉందని తమకు రక్షణ కల్పించాలని కోరింది. ఈ విషయమై హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పుకొచ్చింది. మరోవైపు ప్రణయ్ తండ్రి బాలస్వామి సైతం నిందితులకు బెయిల్ మంజూరు కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకును అత్యంత దారుణంగా హతమార్చిన నిందితులు ఇంత త్వరగా బయటకు వస్తారని తాను ఊహించలేదన్నారు. మరోవైపు నిందితుల భారీ నుంచి ప్రణయ్ కుటుంబ సభ్యులకు ఎలాంటి ముప్పు కలగకుండా పూర్తి రక్షణ కల్పిస్తామని జిల్లా ఎస్పీ రంగనాథ్ స్పష్టం చేశారు.

Pranay Wife Amrutha Objected Bail to Accused

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రాణహాని ఉంది.. రక్షణ పెంచండి: అమృత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: