ప్రణయ్ హత్య కేసులో నిందితులకు బెయిల్

  మన తెలంగాణ/వరంగల్ క్రైం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య చేసిన నిందితులకు శనివారం హైకోర్టు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. వివరాల్లోకి వెళితే కొద్ది నెలల క్రితం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పరువు కోసం కన్న కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందని కూతురి భర్తను వ్యాపారి కిరాయి హంతకులతో దారుణంగా హత్య చేయించిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు ప్రముఖ వ్యాపారి కుమార్తె […] The post ప్రణయ్ హత్య కేసులో నిందితులకు బెయిల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మన తెలంగాణ/వరంగల్ క్రైం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య చేసిన నిందితులకు శనివారం హైకోర్టు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. వివరాల్లోకి వెళితే కొద్ది నెలల క్రితం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పరువు కోసం కన్న కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందని కూతురి భర్తను వ్యాపారి కిరాయి హంతకులతో దారుణంగా హత్య చేయించిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు ప్రముఖ వ్యాపారి కుమార్తె అమృత ప్రణయ్ దళిత యువకున్ని తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా కులాంతర ప్రేమ వివాహం చేసుకుంది. ఇది గిట్టని అమ్మాయి తండ్రి మారుతీరావు తన కుమార్తె భర్త ప్రణయ్‌ని కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి నరికి చంపించాడు.

ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో మృతుడు ప్రణయ్ తల్లిదండ్రులు భార్య ఫిర్యాదు మేరకు అప్పట్లో నల్గొండ పోలీసులు ప్రధాన నిందితుడు మారుతీరావు, సహా నిందితులు ఖరీం, శ్రవణ్‌లను అరెస్ట్ చేసి పిడి యాక్ట్ కింద రిమాండుకు పంపించారు. అప్పటి నుండి వరంగల్ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న నిందితులకు పలుసార్లు బెయిల్‌కు ప్రయత్నించినా కోర్టు మంజూరు చేయలేదు. దాదాపు తొమ్మిది నెలల తరువాత నిందితులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరి చేసింది. నిందితులకు ఉరిశిక్ష విధించాలని మారుతీరావు కుమార్తె అమృత తో పాటు పలు ప్రజాసంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించాయి. ఈ క్రమంలో నిందితులకు శనివారం బెయిల్ మంజూరైనప్పటికి వరంగల్ సెంట్రల్ జైలు అధికారులకు సకాలంలో బెయిల్ పేపర్లు అందకపోవడంతో శనివారం నిందితులను విడుదల చేయలేదు. సోమవారం ఉదయం నిందితులను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు జైలు అధికారులు తెలిపారు.

బెయిల్ రద్దు కోసం సుప్రీం కోర్టుకు వెళ్తా మృతుడి భార్య అమృత

మన తెలంగాణ/నల్లగొండ/మిర్యాలగూడ క్రైమ్ : తన భర్త పెరుమాళ్ళ ప్రణయ్‌ని దారుణంగా హత్య చేయించిన తన తండ్రి మారుతిరావుకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం దారుణమని బెయిల్ రద్దు కోసం తాను సుప్రీం కోర్టుకు వెళ్తానని పెరుమాళ్ళ అమృత తెలిపింది. శనివారం వరంగల్ జైలులో ఉన్న తిరునగర్ మారుతీరావుతో పాటు అతని సోదరుడు శ్రవణ్, కరీమ్‌లకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై పట్టణంలోని సుందర్‌నగర్‌లో గల నివాసంలో అమృత స్పందిస్తూ విలేకరులతో మాట్లాడారు. బెయిల్ ఇస్తే తన భర్తను హత్య చేసిన రీతిలో తమకు హాని ఉండటమే కాకుండా సాక్ష్యాలను తారుమారు చేస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. మారుతిరావు బయటికి వస్తే తనకే కాకుండా తన బిడ్డకు హాని చేస్తాడని భయం వేస్తుందని అందుకోసం పోలీసుల భధ్రతను మరింత పెంచమని వినతి చేసుకునేందుకు వెళ్తామన్నారు. తన భర్తను చంపిన నిందితుకు ఇంత త్వరగా బెయిల్ వస్తుందని అనుకోలేదని తమకు న్యాయం జరిగేంత వరుకు పోరాటం చేస్తానన్నారు.

 

The post ప్రణయ్ హత్య కేసులో నిందితులకు బెయిల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: