ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు : వైద్యులు

Pranab Mukherjee Health Condition Criticalఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రెఫరల్‌ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన్ను వెంటిలేటర్ పైనే ఉంచి చికిత్స అందిస్తున్నామని వారు వెల్లడించారు. అయితే ఆయన ప్రాణాదారాలు స్థిరంగా ఉన్నాయని వారు చెప్పారు. నిపుణులతో కూడిన వైద్య బృందం ఆయనకు వైద్య సేవలు అందిస్తుందని వారు పేర్కొన్నారు. తన తండ్రి ప్రణబ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని ఆయన కూతురు షర్మిష్ఠ ముఖర్జీ శుక్రవారం మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. కాంతికి ఆయన కళ్లు కొంత స్పందిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీ చనిపోయారని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఆమె ఖండించిన విషయమూ విదితమే. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ప్రణబ్ ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆయనకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో గత నాలుగు రోజులుగా ఆయనకు ఆ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. ప్రణబ్ కోలుకోవాలని అన్ని రంగాల ప్రముఖులతో పాటు ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు : వైద్యులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.