బ్యూటిఫుల్ ఏంజెల్

Pragya Jaiswal

 

హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ చేసింది తక్కువ సినిమాలే కానీ మొదటి సినిమా ‘కంచె’తోనే మంచి గుర్తింపు సాధించింది. క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రగ్య నటనకు ప్రశంసలు దక్కాయి. ఆ సినిమా తర్వాత మంచి ఆఫర్లే వచ్చాయి కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి. దీంతో ప్రగ్య కెరీర్ నత్తనడకన సాగుతోంది. అయితే ఆఫర్లు, హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఈ బ్యూటీ సందడి చేస్తోంది. తాజాగా ప్రగ్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.

ఈ ఫోటోకు ‘సన్ సెట్ స్టేట్ ఆఫ్ మైండ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలో హాట్‌హాట్‌గా దర్శనమిచ్చింది ఈ బ్యూటీ. చేత్తో వయ్యారంగా జుత్తును సవరించుకుంటూ స్టైలిష్‌గా పోజిచ్చింది. ఈ ఫోటోకు నేపథ్యం కూడా అదిరిపోయింది. సముద్రం, భానుడి నారింజ రంగు కిరణాలు… ఆ కాంతిలో మెరుస్తున్న శిరోజాలు అదరహో. నెటిజన్లకు ఈ ఫోటో తెగనచ్చడంతో ఆసక్తికరమైన కామెంట్లు పెట్టారు. స్టన్నింగ్ బ్యూటీ కిల్లింగ్ లుక్స్, బ్యూటిఫుల్ ఏంజెల్, సూపర్ హాట్ ట్రాన్స్‌ఫార్మేషన్… అంటూ కామెంట్లు పెట్టారు.

Pragya Jaiswal with Hot Beauty

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బ్యూటిఫుల్ ఏంజెల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.