కెటిఆర్‌కు ప్రభాస్ మద్దతు…

  మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావుకు ప్రముఖ సినీ హీరో ప్రభాస్ మద్దతు తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ప్రజలు జ్వరాలతో బాధపడుతున్న నేపథ్యంలో మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా కొన్ని సూచనలు చేశారు. ‘వైరల్ జ్వరాలు, డెంగ్యూ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మీ ఇంటి ఆవరణలో ఉన్న నీటి తొట్టెలు, పూల కుండీలు, ఎయిర్ కులర్లలో నీటి నిల్వ లేకుండా చూసుకోండి..దోమల వ్యాప్తికి ఇవే కారణం. నా […] The post కెటిఆర్‌కు ప్రభాస్ మద్దతు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావుకు ప్రముఖ సినీ హీరో ప్రభాస్ మద్దతు తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ప్రజలు జ్వరాలతో బాధపడుతున్న నేపథ్యంలో మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా కొన్ని సూచనలు చేశారు. ‘వైరల్ జ్వరాలు, డెంగ్యూ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మీ ఇంటి ఆవరణలో ఉన్న నీటి తొట్టెలు, పూల కుండీలు, ఎయిర్ కులర్లలో నీటి నిల్వ లేకుండా చూసుకోండి..దోమల వ్యాప్తికి ఇవే కారణం. నా ఇంటి పరిసరాలను నేను తనిఖీ చేసి నిల్వ ఉన్న నీటిని తొలగించాం. మీరు కూడా ఆ పనిచేసి ఫొటోలను నాతో పంచుకోండి’ అని ట్వీట్ చేశారు.

మంత్రి కెటిఆర్ చేసిన పనికి యువ కథానాయకుడు ప్రభాస్ ట్విట్టర్ వేదికగా మద్దతు తెలిపారు. కెటిఆర్ తన ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తున్న ఫొటోలను ప్రభాస్ తిరిగి పంచుకుంటూ ‘వైరల్ జ్వరాలు, డెంగ్యూ రాకుండా మీ ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోండి. దయచేసి ఈ విసయాన్ని అందరికీ చేరేలా చూడండి. ఆరోగ్యంగా ఉండండి అని పేర్కొన్నారు. హీరో ప్రభాస్ మద్దతు తెలిపినందుకు కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

Prabhas Support to Minister KTR over dengue

The post కెటిఆర్‌కు ప్రభాస్ మద్దతు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: