ఓకే ఫ్రేమ్‌లో సైరా, బాహుబలి, అల్లూరి…

 

ముంబయి: ఓ అద్భుతమైన కలయికకు ముంబయి వేదికైంది. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఫోటోకు పోజిచ్చారు. ఈ ముగ్గుర్ని ఒకే ఫ్రేమ్‌లో చూసి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. రామ్ చరణ్, చిరంజీవి.. సైరా టీజర్ లాంఛ్ ఈవెంట్ కోసం ముంబయి వెళ్లగా, ప్రభాస్ సాహో ప్రమోషన్స్‌తో అక్కడే బిజీగా ఉన్నాడు. ఖైదీ నెం.150 సినిమా తర్వాత స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్‌ చిరంజీవి నటించిన అత్యంత ప్రతిష్టాత్మక మూవీ ‘సైరా’. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు సైరా టీం మంచి ట్రీట్ ఇచ్చింది. సోమవారం ముంబయిలో సైరా చిత్రయూనిట్ వైభవంగా టీజర్ ను లాంచ్ చేశారు. ఈ వేడుకకు అమితాబ్ బచ్చన్, నయనతార మినహా చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ టీజర్ సూపర్ టాక్ తో నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ అవుతోంది.

Prabhas, chiranjeevi, charan posed in single fame

 

The post ఓకే ఫ్రేమ్‌లో సైరా, బాహుబలి, అల్లూరి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.