గ్రామాన్ని వణికిస్తున్న కరెంట్ షాక్

  గంగిమాన్ దొడ్డిలో ఇళ్ళకు కరెంట్ షాక్ బిక్కుబిక్కుమంటు ప్రాణాలను కాపడుకుంటున్న గ్రామస్తులు, పట్టించుకోని విద్యుత్ అధికారులు విధుల పట్ల నిర్లక్షం వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి గట్టు : గత నెల క్రితం విద్యుత్ షాక్‌కు గురై లైన్‌మెన్ మృతి చెందిన సంఘటన మరువక ముందే మండల పరిధిలోని గంగిమాన్ దొడ్డి గ్రామాన్ని కరెంట్ షాక్ ప్రజలను వణికిస్తుంది కరెంట్ సరఫర అయ్యె ట్రాన్స్‌ఫార్మర్ వద్ద అర్తి ంగ్ సరిగ్గా లేక పోవడంతో గ్రామంలోని ఇళ్ళ గోడలకు […] The post గ్రామాన్ని వణికిస్తున్న కరెంట్ షాక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

గంగిమాన్ దొడ్డిలో ఇళ్ళకు కరెంట్ షాక్
బిక్కుబిక్కుమంటు ప్రాణాలను కాపడుకుంటున్న
గ్రామస్తులు, పట్టించుకోని విద్యుత్ అధికారులు
విధుల పట్ల నిర్లక్షం వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి

గట్టు : గత నెల క్రితం విద్యుత్ షాక్‌కు గురై లైన్‌మెన్ మృతి చెందిన సంఘటన మరువక ముందే మండల పరిధిలోని గంగిమాన్ దొడ్డి గ్రామాన్ని కరెంట్ షాక్ ప్రజలను వణికిస్తుంది కరెంట్ సరఫర అయ్యె ట్రాన్స్‌ఫార్మర్ వద్ద అర్తి ంగ్ సరిగ్గా లేక పోవడంతో గ్రామంలోని ఇళ్ళ గోడలకు ఇంటిలో ఉండే సామాగ్రికి కరెంట్ సరఫర అతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని విషయమై పలుమార్లు విద్యుత్ అధికారులకు విన్నవించుకున్నా కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌లు లేవవంటూ మాట దాటి వేస్తు దాదాపు రెండు నెలల వ్యవధి కావస్తుందని ట్రాన్సఫార్మర్‌కు సంబంధించిన డిడిలు చేల్లించినప్పటికి నిర్లక్ష వైకరితో సమాధానం ఇస్తున్నారని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

గత మూడు రోజులు కురుస్తున్న వర్షానికి కరెంట్ ఓల్టేజి మరింత ఎక్కువ అవ్వడంతో ఇంటిలో ఏ వస్తువు ముట్టుకున్న కరెంట్ షాక్ వస్తుందని చేసేదేమి లేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలాన్ని వెళ్ళదీస్తున్నామని ముఖ్యంగా చిన్నారుల పరిస్థితి చూస్తే దారుణంగా ఉందని ఎందుకంటే గ్రామంలో నివసించే ప్రజలు వ్యవసాయమే జివనాధారంగా బ్రతుకుతున్నారు.ఉదయాన్నే తమ పిల్లలను బడికి పంపించి వారు పొలం పనులకు వెల్ళి వాటిని ముగించుకుని సాయంత్రం ఇంటికి చేరుకుని రాత్రి ఏదో కాసేపు టివి చూస్తు నాలుగు ముద్దలు భోజనం పూర్తి చేసి ప్రశాతంగా నిద్రించాల్సింది పోయి వారి పిల్లలు ఎక్కడ లేచి షాకుకు గురి అవుతారేమొనని రాత్రి అంత నిద్ర పోకుండా తమ పిల్లలు విద్యుత్ షాక్‌కు గురి కాకుండా కాపాడుకుంటున్నారు.

దీని విషయమై పంచాయతీ కార్యదర్శిని ప్రశ్నించగా గ్రామంలో అలా ంటి సమస్యలు ఏమి లేవని తన దృష్టికి రాలేదని గ్రామస్తులకు ఫోన్ చేసి కనుక్కుంటానని సమాధానం చెప్ప డం సదరు అధికారి విధుల పట్ల ఎంత బాధ్యత వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు పంచాయతీ కార్యదర్శి రో జు విధిగా పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులకు ప్రభుత్వ పథకాలను వివరించి గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవలసిన అధికారి వారానికి ఒకటి రెండు రోజులు సందర్శించి వేళుతుందని విధులకు హాజరు కావడం లేదని పలుమార్లు మండల అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళినా పట్టించుకోవడం లేదని గ్రామప్రజలు వాపోయారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి విధుల పట్ల నిర్లక్షం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని విద్యుత్ సమస్యను పరిస్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Power shock to houses in Gangimandoddi Village

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గ్రామాన్ని వణికిస్తున్న కరెంట్ షాక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: