పోలీసులపైకి కుక్కలను వదిలిన పివిపి

Potluri Varaprasad who left the dogs on the police

 

మనతెలంగాణ, హైదరాబాద్ : కేసు విచారణలో భాగంగా ఇంటికి విచారణకు వెళ్లిన పోలీసులపైకి పివిపి కుక్కలను వదిలి వెళ్లిన సంఘటన నగరంలోని బంజారాహిల్స్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…గతవారం తన ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుని దౌర్జన్యం చేస్తున్నాడని పివిపిపై ఓ వ్యక్తి బంజారాహిల్స్ పోలీసులకు గత వారం ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన పోలీసులు వైసిపి నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌పై కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 82లో ఉన్న పివిపి ఇంటికి ఎస్సై హరీశ్‌రెడ్డి, కానిస్టేబుళ్లు వెళ్లగా వారిపైకి కుక్కలను వదిలాడు. ఒక్కసారిగా ఖంగుతిన్న పోలీసులు వెనుతిరిగి వచ్చి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post పోలీసులపైకి కుక్కలను వదిలిన పివిపి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.