ఇంటర్ మూల్యాంకనం…పరీక్షలు వాయిదా

  మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంతో భాగంగా ఈ నెల 31 వరకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సోమవారం నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియేట్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ప్రకటించారు. తర్వాత నిర్వహించే జవాబుపత్రాల మూల్యాంకన షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే సోమవారం(మార్చి 23) రోజున జరగాల్సిన ఇంటర్ పరీక్షలు జియోగ్రఫీ పేపర్2, మోడర్న్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ […] The post ఇంటర్ మూల్యాంకనం… పరీక్షలు వాయిదా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంతో భాగంగా ఈ నెల 31 వరకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సోమవారం నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియేట్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ప్రకటించారు. తర్వాత నిర్వహించే జవాబుపత్రాల మూల్యాంకన షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే సోమవారం(మార్చి 23) రోజున జరగాల్సిన ఇంటర్ పరీక్షలు జియోగ్రఫీ పేపర్2, మోడర్న్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పేపర్2, మోడర్న్ లాంగ్వేజ్ ఉర్దూ పేపర్ 2, మోడర్న్ లాంగ్వేజ్ హిందీ పేపర్ 2 వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Postpone evaluation of Intermediate

The post ఇంటర్ మూల్యాంకనం… పరీక్షలు వాయిదా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: