215 కేజీల గంజాయి స్వాధీనం

Marijuana

 

సత్తుపల్లి : విశాఖపట్టణం జిల్లా నర్సరీపట్టణం నుంచి మహారాష్ట్రలోని అహ్మదాబాద్‌కు భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు మంగళవారం ఉదయం పట్టుకున్నారు. 100 ప్యాకెట్లలో 215 కిలోల గంజాయిని కారు ఢిక్కిలో వేసుకొని నర్సీపట్నం నుంచి బయలుదేరిన కారును విశ్వసనీయ సమాచారం మేరకు సత్తుపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా సత్తుపల్లి ఎసిపి ఎన్. వెంకటేశ్ విలేకర్లతో మాట్లాడారు. మహారాష్ట్రకు చెందిన కొందరు ఏడాది కాలంగా గంజాయిని వివిధ మార్గాల ద్వారా తరలిస్తూ అధిక మొత్తంలో అక్రమార్జనకు పాల్పడుతున్నారని ఎసిపి తెలిపారు. అహ్మద్‌బాద్‌కు చెందిన అస్లాం షౌకత్ షేక్ అనే వ్యక్తి ఓ కారును డ్రైవర్‌కు అప్పగించాడు.

సదరు డ్రైవర్ ఈ కారును కొత్తగూడెం, భద్రాచలరం, చింతూరు, రంపచోడవరం మీదుగా నర్సీపట్నంకు తీసుకెళ్ళి అక్కడ గంజాయిని లోడు చేసుకుని అహ్మదాబాద్‌కు తీసుకెళ్ళేందుకు సత్తుపల్లి మీదుగా విజయవాడ వైపు వెళుతున్నాడు. దీనిపై సమాచారం అందటంతో అప్రమత్తమై తమ సిబ్బంది పట్టణ శివారులోని అయ్యప్ప గుడి వద్ద నిఘా పెట్టి కారును పట్టుకోవటం జరిగిందని ఎసిపి పేర్కొన్నారు.

ఈ గంజాయి అక్రమ రవాణాకు మూల సూత్రధారులైన మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 25 లక్షల వరకు ఉంటుందని ఎసిపి వెంకటేష్ తెలిపారు. గంజాయిని పట్టుకోవటంలో సిఐ రమాకాంత్, ఎఎస్‌ఐ బాలస్వామి, సిబ్బంది రామ్మూర్తి, సుభానిలను ఆయన అభినందించారు. వీరికి నగదు రివార్డు అందించేందుకు పోలీస్ ఉన్నతాధికారులు సిఫారసు చేశామన్నారు.

Possession of 215 kg Marijuana

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 215 కేజీల గంజాయి స్వాధీనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.