రోడ్డు ప్రమాదంలో పొన్నాల సోదరి మనవడి మృతి

మనతెలంగాణ, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ మాజీ పిసిసి ఛీఫ్, సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య సోదరి మనవడు సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం… పోన్నాల లక్ష్మయ్య సోదరి అల్లుడు కరుణాకర్ కుమారుడు ధృపత్(22) ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. ఖాజాగూడలో ఉంటున్న ధృపత్, తన వద్దకు వచ్చిన స్నేహితుడిని ఫైనాన్‌షియల్ డిస్ట్రిక్ట్ వద్ద ఉన్న హాస్టల్ లో దింపి అతివేగంగా బైక్‌ను నడుపుకుంటూ రావడంతో విప్రో సర్కిల్ వద్ద బైక్ ను ఢీకొట్టి డివైడర్‌పై పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.

 

Ponnala Laxmaiah relative dead in road accident

The post రోడ్డు ప్రమాదంలో పొన్నాల సోదరి మనవడి మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.