ఏప్రిల్ 17న జరగాల్సిన పాలిసెట్ వాయిదా..?

  టెన్త్ పరీక్షల వాయిదానే కారణం మనతెలంగాణ/హైదరాబాద్ : పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్ష వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 17వ తేదీన పాలిసెట్ పరీక్ష నిర్వహించాలి. పదవ తరగతి పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో పాలిసెట్‌ను వాయిదా వేయనున్నట్లు తెలిసింది. ఈ నెల 19 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యే నాటికి కరోనా పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. అయినా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటూ […] The post ఏప్రిల్ 17న జరగాల్సిన పాలిసెట్ వాయిదా..? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

టెన్త్ పరీక్షల వాయిదానే కారణం

మనతెలంగాణ/హైదరాబాద్ : పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్ష వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 17వ తేదీన పాలిసెట్ పరీక్ష నిర్వహించాలి. పదవ తరగతి పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో పాలిసెట్‌ను వాయిదా వేయనున్నట్లు తెలిసింది. ఈ నెల 19 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యే నాటికి కరోనా పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. అయినా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. పది పరీక్షలు మూడు రోజుల(రెండు సబ్జెక్టులు)పాటు జరిగాయి. అవి ఏప్రిల్ 6వ తేదీ వరకు జరగాల్సి ఉంది. ఈ సమయంలోనే టెన్త్ పరీక్షలు వాయిదా వేయాలంటూ హైకోర్టు ఆదేశించడంతో ఈ నెల 23 నుంచి 30 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది.

పరిస్థితిని బట్టి పరీక్షల రీ షెడ్యూల్‌ను విద్యాశాఖ ప్రకటించనుంది. కరోనా నియంత్రణలోకి వచ్చినా 31వ తేదీ అనంతరం రెండు మూడు రోజుల వ్యత్యాసం ఇచ్చి పదవ తరగతి పరీక్షలు ప్రారంభించాలి. మొత్తం 11 రోజుల పాటు పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ కరోనా ప్రభావం తగ్గి ఏప్రిల్ 3వ తేదీ నుంచి పరీక్షలు మొదలైనా ఏప్రిల్ 15వ తేదీకి పూర్తవుతాయి. అన్నీ అనుకున్నట్లు జరిగినా పది పరీక్షల తర్వాత ఒకటి రెండు సమయం మాత్రమే ఉంటుంది. టెన్త్ పరీక్షలకు ప్రిపేరై పరీక్షలు రాసిన విద్యార్థులు వెంటనే పాలిసెట్‌కు ప్రిపేర్ కాలేరని, కనీసం వారం పది రోజుల సమయం ఉండాలని అధికారులు చెబుతున్నారు. పాలిసెట్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 2వ తేదీతో ప్రారంభమై, ఏప్రిల్ 4తో ముగియనుంది. ఇప్పటివరకు పాలిసెట్‌కు 18 వేల దరఖాస్తులు అందాయి. ప్రస్తుత పరిస్థితుల్లో దరఖాస్తు గడువును కూడా పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెలాఖరుకు కరోనా పరిస్థితిని సమీక్షించి పదవ తరగతి పరీక్షల రీ షెడ్యూల్‌పై నిర్ణయం తీసుకుంటారని పాఠశాల విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

Polytechnic Entrance Exam Postponed

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఏప్రిల్ 17న జరగాల్సిన పాలిసెట్ వాయిదా..? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: