నల్లాల ద్వారా కలుషిత నీటి సరఫరా

polluted-water

పెద్దవంగర: మండల కేంద్రంలోని కోరిపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనిలో అధికారులు , సిబ్బంది నిర్లక్షం కారణంగా కుళాయిల ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతోంది. దీంతో కాలనీవాసులు రోగాల బారిన పడుతున్నారు . ముఖ్యంగా కాలనీ వాసులకు ప్రత్యేకంగా వేసిన బోరు పైపులైను లీకేజీతో రంగుమారిన నీరు సరఫరా అవుతుంది. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులకు , అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికి ఎలాంటి స్పందన లభించడం లేదని స్థానికులు వాపోతున్నారు. నీటి శుద్ది కోసం వేల రుపాయలు ఖర్చుపెడుతున్నామని ప్రజా యాత్రంగం చెబుతున్న ,అయినప్పటికి నీటి శుధ్ది జరగకపోవడం కలుషితనీరు సరఫరా అవుతుండడంతో నీటి సరఫరా తీరు ప్రశ్నార్ధకంగా మారింది . అసలు జలాలను శుద్ధి చేస్తూన్నారా లేదా దానికోసం తీసుకుంటున్న నిధులేమవుతున్నాయవుతున్నాయని ప్రజలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క ఏళ్ల క్రితం వేసిన పైపులైను ,మురికి కాలువల పక్కనుంచి వేసిన పైపులైను మార్చకపోవడంతో సైతం నీరు కలుషితమవుతుందని కాలనీ వాసులు వాపోతున్నారు . ఇప్పటికైన ప్రజాప్రతినిధులు , అధికారులు స్పందించి పైపులైను లీకేజిని మరమ్మత్తు చేయాలని కోరుతున్నారు .

Polluted water supply through blacks

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నల్లాల ద్వారా కలుషిత నీటి సరఫరా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.