పార్టమెంట్ కు సిద్ధమౌతున్న పార్టీలు

  14 తర్వాత టిఆర్‌ఎస్ ప్రచార సన్నాహాలు ఎంపి జితేందర్‌రెడ్డికే తిరిగి టికెట్ ? బిజెపి పార్లమెంట్ అభ్యర్థిగా శాంతకుమార్ మార్గం సగమం మన తెలంగాణ/ మహబూబ్ నగర్: రాజకీయ పార్టీలు పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమౌతున్నాయి. మార్చి రెండో వారంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ చేయవచ్చునన్న ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 13కు పార్లమెంట్ సమావేశాలు ముగుస్తున్న నేపథ్యంలో 14వ తేదీ నుంచి […]

 

14 తర్వాత టిఆర్‌ఎస్ ప్రచార సన్నాహాలు
ఎంపి జితేందర్‌రెడ్డికే తిరిగి టికెట్ ?
బిజెపి పార్లమెంట్ అభ్యర్థిగా శాంతకుమార్ మార్గం సగమం

మన తెలంగాణ/ మహబూబ్ నగర్: రాజకీయ పార్టీలు పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమౌతున్నాయి. మార్చి రెండో వారంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ చేయవచ్చునన్న ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 13కు పార్లమెంట్ సమావేశాలు ముగుస్తున్న నేపథ్యంలో 14వ తేదీ నుంచి ఆయా జిల్లాల ఎంపిలు జిల్లా పరిధిలోనే ఉండాలని సిఎం ఆదేశాలు జారీ చేశారు. అంతలోగానే మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తి చేసి పార్లమెంట్ ఎన్నికలకు పూర్తి స్థాయిలో నాయకులను, కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు టిఆర్‌ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టింంది. జిల్లా విషయానికొస్తే మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపి జితేందర్‌రెడ్డికే తిరిగి టికెట్ లభించనుంది. ఎంపి జితేందర్‌రెడ్డి ప్రస్తుతం లోక్‌సభలో టిఆర్‌ఎస్ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు.

పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఎంపి జితేందర్‌రెడ్డి జిల్లాకు రానున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలలో ప్రచారానికి ప్రణాళికలు వేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. మహబూబ్‌నగర్ పార్లమెంట్‌లో షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్ విజయం సొంతం చేసుకుంది. ఎమ్మెల్యేలు కూడా అనేక మంది భారీ మెజార్టీతో గెలిచారు. ఈ బలంతో పార్లమెంటు సీటు కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. ఎలాగైనా జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునేలా టిఆర్‌ఎస్ వ్యూహం పన్నుతోంది.

బిజెపి అభ్యర్థిగా శాంతకుమార్: మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా బిజెపి నుంచి శాంతకుమార్ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొదటి నుండి శాంతకుమార్ ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి పార్టీల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం బిజెపి రాష్ట్ర కోశాధికారిగా- ఉంటున్నారు. కేంద్ర స్థాయిలోని ప్రధాని నరేంద్రమోడీ, అధ్యక్షులు అమిత్‌షాతో సంబంధాలు ఉండడమే కాకుండా రాష్ట్ర స్థాయి బిజెపి నేతలతో కూడా సఖ్యతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకే టికెట్ లభించనుంది. బిజెపి పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు ఆయా జిల్లాల బూత్‌స్థాయి కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానిని కూడా రప్పించి దిశా నిర్దేశం చేయించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలని ఆమె కార్యకర్తలకు సూచించి వెళ్లారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.

కాంగ్రెస్ మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరుంటారన్న దానిపై ఇప్పటి వరకు నాగర్‌కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే మల్లు రవి కాంగ్రెస్ అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంటు స్థానం నుంచి సూదిని జయపాల్‌రెడ్డి, రేవంత్ రెడ్డి, డికె అరుణ పోటీలో ఉండే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది.

Political Parties Preparing For Parliamentary Elections

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: