స్పీకర్ ను కలవండి…

ఢిల్లీ: కర్ణాటక రెబల్ ఎంఎల్ఎల పిటిషన్‌పై సుప్రీం కోర్టు గురువారం విచారణ చేపట్టింది. గురువారం సాయంత్రం 6 గంటల్లోపు రెబల్ ఎంఎల్ఎలు స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ ఎదుట హాజరు కావాలని సుప్రీంకోర్టు  ఆదేశాలు జారీ చేసింది. గురువారం ఉదయం 11 గంటలకు ఈ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరిగింది. స్పీకర్‌ ఎదుట హాజరై రాజీనామా విషయాన్ని ఆయనతో చర్చించాలని రెబల్ ఎంఎల్ఎలకు కోర్టు సూచించింది. ఈ క్రమంలో కర్నాటక రాష్ట్ర ప్రభుత్వానికి, స్పీకర్‌కు కోర్టు నోటీసులు జారీ […] The post స్పీకర్ ను కలవండి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ: కర్ణాటక రెబల్ ఎంఎల్ఎల పిటిషన్‌పై సుప్రీం కోర్టు గురువారం విచారణ చేపట్టింది. గురువారం సాయంత్రం 6 గంటల్లోపు రెబల్ ఎంఎల్ఎలు స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ ఎదుట హాజరు కావాలని సుప్రీంకోర్టు  ఆదేశాలు జారీ చేసింది. గురువారం ఉదయం 11 గంటలకు ఈ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరిగింది. స్పీకర్‌ ఎదుట హాజరై రాజీనామా విషయాన్ని ఆయనతో చర్చించాలని రెబల్ ఎంఎల్ఎలకు కోర్టు సూచించింది. ఈ క్రమంలో కర్నాటక రాష్ట్ర ప్రభుత్వానికి, స్పీకర్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో శుక్రవారం లోగా నివేదిక ఇవ్వాలని కోర్టు  ఆదేశించింది. రెబల్ ఎంఎల్ఎలు బెంగళూరుకు చేరుకునేందుకు తగిన భద్రత కల్పించాలని కర్ణాటక డిజిపిని కోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై  తదుపరి విచారణను శుక్రవారం నాటికి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా రాజరాజేశ్వరి నగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మునిరత్నం ముంబయి నుంచి బెంగళూరుకు తిరిగొచ్చారు. గురువారం సాయంత్రం కర్నాటక కేబినెట్ భేటీ జరగనుంది. దీంతో కర్నాటక సిఎం కుమారస్వామి, తన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో   కుమారస్వామి సిఎం పదవికి రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి.

Political Crisis In Karnataka State…Supreme Intervention

Related Images:

[See image gallery at manatelangana.news]

The post స్పీకర్ ను కలవండి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: