సిఐ వాట్సప్ మెసేజ్‌తో పోలీసు శాఖలో కలవరం

  మన తెలంగాణ/హైదరాబాద్ : ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేని విధంగా ఉన్నాయని, తన సమస్యకు ఆత్మహత్యే మార్గమని నిజామాబాద్ జిల్లా రూద్రూర్ సిఐ దామోదర్‌రెడ్డి పెట్టిన వాట్సప్ మెసేజ్ పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది. ఉన్నతాధికారుల టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవలనిపిస్తుందని దామోదర్ పంపిన మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 30 ఏళ్లుగా పనిచేసినా బలిదానం తప్పదేమోనని బలహీన క్షణా లు భయం కలిగిస్తున్నాయంటూ మెసేజ్ పెట్టడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. పోలీసు ఉన్నతాధికారులు […] The post సిఐ వాట్సప్ మెసేజ్‌తో పోలీసు శాఖలో కలవరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
 

 

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేని విధంగా ఉన్నాయని, తన సమస్యకు ఆత్మహత్యే మార్గమని నిజామాబాద్ జిల్లా రూద్రూర్ సిఐ దామోదర్‌రెడ్డి పెట్టిన వాట్సప్ మెసేజ్ పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది. ఉన్నతాధికారుల టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవలనిపిస్తుందని దామోదర్ పంపిన మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 30 ఏళ్లుగా పనిచేసినా బలిదానం తప్పదేమోనని బలహీన క్షణా లు భయం కలిగిస్తున్నాయంటూ మెసేజ్ పెట్టడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. పోలీసు ఉన్నతాధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐ దామోదర్‌రెడ్డి వాట్సప్‌లో పెట్టిన మెసేజ్‌తో జిల్లా పోలీసు వర్గాల్లోనూ కలవరం మొదలైంది. దామోదర్‌రెడ్డిని ఇబ్బందులకు గురిచేసిన పోలీసు ఉన్నతాధికారులు ఎవరై ఉంటారన్న చర్చసాగుతోంది. అయితే దామోదర్‌రెడ్డికి ఐజి ఆఫీస్ నుంచి చార్జ్ మెమో జారీ కావడంతో అతను వాట్సప్‌లో తన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

 

Police Officers Harassment on Circle Inspector in NZBD

The post సిఐ వాట్సప్ మెసేజ్‌తో పోలీసు శాఖలో కలవరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: