మెగాస్టార్ చిరంజీవి ఇంటి వద్ద ఉద్రిక్తత

Chiranjeevi

హైదరాబాద్: నగరంలోని మెగాస్టార్ చిరంజీవి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం లేదంటూ అమరావతి పరిరక్షణ సమితి జెఎసి శనివారం చిరంజీవి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో చిరు ఇంటివద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవరావతి విషయంలో చిరంజీవిని ఏమైనా అంటే ఊరుకోబోమని చిరు అభిమానులు ఆయన ఇంటికి వద్దకు భారీగా చేరుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చిరు ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. అయితే అమరావతి పరీరక్షణ జెఎసి మాత్రం చిరు ఇంటి ఎదుట జరుగుతున్న ధర్నాతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం గమనార్హం.

Police Huge Security At Megastar Chiranjeevi House

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మెగాస్టార్ చిరంజీవి ఇంటి వద్ద ఉద్రిక్తత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.