రాష్ట్రంలో పోలీసుల…కరోనా ఫైన్ షురూ

వాహనాలు 3 కిలోమీటర్లు దాటితే జరిమాన గీత దాటిన వాహన చోదకులకు రెండేళ్ల జైలుశిక్ష ఎన్‌పిఆర్ టెక్నాలజీతో వాహనాల గుర్తింపు ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్1897 ప్రకారం కేసు నమోదు   మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూ తమ ఇంటి నుంచి మూడు కిలోమీటర్లు దాటి ప్రయాణీంచే వాహన చోదకులకు పోలీసులు ఇకపై జరిమానాలు విధించనున్నారు. ఈ చట్టాన్ని రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే అమలులోకి తీసుకురానున్నారు. ముఖ్యంగా గల్ఫ్ తరహా టెక్నాలజీని […] The post రాష్ట్రంలో పోలీసుల…కరోనా ఫైన్ షురూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వాహనాలు 3 కిలోమీటర్లు దాటితే జరిమాన
గీత దాటిన వాహన చోదకులకు రెండేళ్ల జైలుశిక్ష
ఎన్‌పిఆర్ టెక్నాలజీతో వాహనాల గుర్తింపు
ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్1897 ప్రకారం కేసు నమోదు

 

మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూ తమ ఇంటి నుంచి మూడు కిలోమీటర్లు దాటి ప్రయాణీంచే వాహన చోదకులకు పోలీసులు ఇకపై జరిమానాలు విధించనున్నారు. ఈ చట్టాన్ని రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే అమలులోకి తీసుకురానున్నారు. ముఖ్యంగా గల్ఫ్ తరహా టెక్నాలజీని రాష్ట్ర పోలీసులు వాడనున్నారు. ఎవరి వాహనమైనా ఇంటి నుంచి 3 కిలోమీటర్ల పరిధి దాటితే ఆటోమెటిక్ ప్లేట్ రికగ్నేషన్ (ఎఎన్‌పిఆర్) కెమెరాలతో నిఘా సారించి గుర్తిస్తారు. ఈ క్రమంలో నగరంలోని పలు ప్రధాన రహదారులలో, కూడళ్లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆయా కెమెరాలకు నూతన టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నారు. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించినా, కొందరు యువకులు కర్ఫ్యూ ఆంక్షలను పట్టించుకోవడం లేదని పోలీసులు గుర్తించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిని కట్టడి చేసేందుకు తెలంగాణ పోలీసులు సరికొత్త వ్యూహం అమలు చేయనున్నారు. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ సాంకేతికతతో రోడ్లపైకి వచ్చిన వాహనం నంబరు గుర్తిస్తున్నారు. దాని ఆధారంగా వారిపై ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్1897 ప్రకారం కేసులను నమోదు చేస్తున్నారు. ఈ సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. ఎలాంటి కారు నంబరునైనా, వాహనం ఎంత వేగంలో ఉన్నా సరే ఇది సులభంగా గుర్తిస్తుంది. గీత దాటిన వాహన యజమానుల వివరాలు సైతం ప్రత్యక్షమవుతాయి. లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం ప్రతీ వాహనం రెండు కి.మీ.లోపే పరిమితం కావాలన్నది నిబంధన. కానీ కొందరు ఇష్టానుసారం ప్రయాణిస్తున్నారు. ఈ కెమెరాతో నంబరును గుర్తించి, వాహనదారుడి చిరునామాకు, అతను వాహనం కెమెరాకు చిక్కిన ప్రాంతానికి మధ్య దూరం చూసి కేసు నమోదు చేస్తారు. గంటల్లోనే సదరు వాహన యజమాని అరెస్టు అవుతారు. అన్ని జిల్లాల్లో ప్రతీ కెమెరాకు ఈ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానించారు.దీంతో సదరు వాహనం యజమానిపై ఐపిసి 188, 269, 270, 271 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. గరిష్టంగా రెండేళ్ల వరకు జైలు శిక్ష పడు తుందని హెచ్చరిస్తున్నారు. అకారణంగా ఇళ్ల నుం చి బయటికి వచ్చే వాహనదారులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని, అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవద్దని పోలీసులు ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

Police Heavy fine to Vehicle with rules negligence

 

The post రాష్ట్రంలో పోలీసుల…కరోనా ఫైన్ షురూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: