అమృత పరువు తీసిందన్న కసితో…

మిర్యాలగూడ : తనకున్న ఏకైక కూతురు అమృత తక్కువ కులం వాడైన ప్రణయ్ ను పెళ్లి చేసుకుందన్న కసితో ఆమె తండ్రి మారుతీరావు తన ఆస్తిలో అమృతకు చిల్లిగవ్వ కూడా దక్కకుండా వీలునామా రాశాడు. అమృత తక్కువ కులపోడిని చేసుకుందన్న కోపంతో మారుతీరావు అమృత భర్త ప్రణయ్ ను గత ఏడాది కోటి రూపాయల సుఫారీ ఇచ్చి హత్య చేయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మారుతీరావు, అతడి సోదరుడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇటీవలే […] The post అమృత పరువు తీసిందన్న కసితో… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మిర్యాలగూడ : తనకున్న ఏకైక కూతురు అమృత తక్కువ కులం వాడైన ప్రణయ్ ను పెళ్లి చేసుకుందన్న కసితో ఆమె తండ్రి మారుతీరావు తన ఆస్తిలో అమృతకు చిల్లిగవ్వ కూడా దక్కకుండా వీలునామా రాశాడు. అమృత తక్కువ కులపోడిని చేసుకుందన్న కోపంతో మారుతీరావు అమృత భర్త ప్రణయ్ ను గత ఏడాది కోటి రూపాయల సుఫారీ ఇచ్చి హత్య చేయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మారుతీరావు, అతడి సోదరుడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇటీవలే వీరు బెయిల్ పై విడుదలయ్యారు. తన స్వార్జితమైన ఆస్తిలో ఒక్క పైసా కూడా అమృతకు దక్కకూడదని మారుతీరావు వీలునామా రాశాడని కోర్టుకు సమర్పించిన చార్జ్ షీట్ లో పోలీసులు పేర్కొన్నారు. ప్రణయ్ తో కలిసి తాను తీసుకున్న వీడియోలను అమృత బంధుమిత్రులకు పంపించిందని, దీంతో తన పరువు పోయిందన్న కోపంతో ఆమె తండ్రి మారుతీరావు కిరాయి హంతకునికి కోటి రూపాయల సుఫారీ ఇచ్చి ప్రణయ్ ను చంపించాడని పోలీసులు తెలిపారు.

Police Filed Charge Sheet On Maruthi Rao

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అమృత పరువు తీసిందన్న కసితో… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.